HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Shock For Gold Enthusiasts Gold And Silver Prices Soar

Today Gold Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2026 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Silver Prices
Today Gold Silver Prices

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాల్ని 6 నుంచి 15 శాతానికి పెంచగా, కిందటి రోజు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ అక్కడి నుంచి రూ. 5 వేల వరకు బంగారం ధర తగ్గింది. వెండి రేటు కూడా రూ. 5 వేలు తగ్గుముఖం పట్టింది.

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు ఏదైనా బంగారం ఉండాల్సిందే. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతలా బంగారం మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అయితే బంగారం ధరల్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేట్లు, క్రూడాయిల్ ధరలు, యూఎస్ డాలర్, అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వాణిజ్య ఒప్పందాలు, టారిఫ్స్ ఇలా అన్నీ బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది.

బంగారం కేవలం అలంకరణ సామగ్రిగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనంగా ఉంది. బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ బాగానే ఉంటుంది. గతేడాది బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చాయి. కానీ మళ్లీ కేంద్రం షాక్ ఇవ్వడంతో బంగారం ధరలు కిందటి రోజు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

విదేశీ మారకాన్ని పొదుపుగా వాడుకునేందుకు భారతీయులు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మళ్లీ కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని 6 శాతం నుంచి ఒకేసారి 15 శాతానికి పెంచింది. దీంతో మే 13న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 12,750 పెరిగి 10 గ్రాములకు రూ. 1,53,900కు చేరిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే ఇవాళ రూ. 5,100 తగ్గి తులం రూ. 1,48,800కు చేరింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు కిందటి రోజు తులం రూ. 1,67,890 వద్ద ఉండగా ఇవాళ అది రూ. 1,62,330కి పడిపోయింది.

బంగారం ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో చూస్తే ఇవాళ సిల్వర్ రేటు రూ.5 వేలు తగ్గి ప్రస్తుతం కేజీకి రూ.3.15 లక్షలకు చేరింది. కిందటి రోజు చూస్తే ఒక్కరోజులోనే రూ.20 వేలు పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 4700 డాలర్ల దిగువన ఉండగా.. సిల్వర్ రేటు 87 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24K gold rate
  • Daily gold price
  • Global Gold Prices
  • gold sliver
  • MCX Gold
  • Mcx Share Price
  • MCX Shares Crash
  • sliver price

Related News

PM Modi

Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష

  • PM Modi

    PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

  • Modi Urges No Gold Purchase

    Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • Gold Rate Today

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

  • Gold Price

    Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

Latest News

  • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

  • CEEW : జియోథర్మల్ ఎనర్జీ – ఏపీ, తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో భారీ అవకాశాలు

  • Survival : సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యంగా ‘రికవరీ వన్ 2026’

  • Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

  • Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

Trending News

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd