ఇకపై మన అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!
చాలా సందర్భాలలో మనకు EMI తేదీ గుర్తుండదు. ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే బ్యాంకులు భారీగా పెనాల్టీలు విధిస్తాయి.
- Author : Gopi
Date : 22-04-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
Auto-Debit Rules: ఉదయం నిద్రలేవగానే బ్యాంక్ నుండి డబ్బులు కట్ అయ్యాయి అనే మెసేజ్ చూసి, అవి ఎందుకు కట్ అయ్యాయో తెలియక మీరు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఇకపై అలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఖాతా నుండి ఆటో-డెబిట్ అయ్యే ప్రతిసారీ బ్యాంక్ ముందస్తుగా మీ అనుమతి తీసుకోవడమే కాకుండా, సమాచారం కూడా అందించాలి.
24 గంటల ముందే నోటిఫికేషన్
కొత్త నియమం ప్రకారం.. మీ ఖాతా నుండి డబ్బులు కట్ కావడానికి కనీసం 24 గంటల ముందే బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపడం తప్పనిసరి. ఆ మెసేజ్‌లో రేపు ఎంత మొత్తం కట్ అవుతుంది? ఏ కారణం కోసం కట్ అవుతుంది? అనే వివరాలు ఉంటాయి. దీనివల్ల మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలో లేదో ముందే నిర్ణయించుకోవచ్చు.
Also Read: Sachin Tendulkar : నేడు దంతెవాడకు సచిన్ .. కారణం ఇదేనా!
బౌన్స్ ఛార్జీల భయానికి గుడ్-బై
చాలా సందర్భాలలో మనకు EMI తేదీ గుర్తుండదు. ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే బ్యాంకులు భారీగా పెనాల్టీలు విధిస్తాయి. ఇప్పుడు 24 గంటల ముందే అలర్ట్ రావడం వల్ల మీరు సకాలంలో నిధులను సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల చెక్ బౌన్స్ టెన్షన్ ఉండదు. అనవసరపు జరిమానాలు కట్టాల్సిన అవసరం రాదు.
ఈ నిబంధనలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఒకవేళ ఏదైనా ఆటో-పేమెంట్ తప్పు అని మీకు అనిపించినా లేదా దాన్ని ఆపాలనుకున్నా ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు దాన్ని రద్దు లేదా సవరణ చేయవచ్చు. మీ సమ్మతి లేకుండా బ్యాంక్ తన ఇష్టానుసారం డబ్బులు తీసుకోలేదు.
ఈ నియమం ఏయే పేమెంట్లకు వర్తిస్తుంది?
- హోమ్ లోన్, కార్ లోన్ వంటి EMIలు.
- ఇన్సూరెన్స్ ప్రీమియం.
- నెట్‌ఫ్లిక్స్, జిమ్ సబ్‌స్క్రిప్షన్ వంటి అన్ని రకాల రికరింగ్ పేమెంట్లు.
- రూ. 15,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలకు ‘అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ కూడా తప్పనిసరి.
బ్యాంక్ నిబంధన అతిక్రమిస్తే.. ఫిర్యాదు చేయండి!
ఒకవేళ ఏ బ్యాంకైనా 24 గంటల ముందు సమాచారం ఇవ్వకుండా మీ ఖాతా నుండి డబ్బులు కట్ చేస్తే మీరు నేరుగా బ్యాంక్ లోక్ పాల్ కి ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్ల అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా ఇటు నుండి అటు కదలకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.