HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Rbi Delivers Good News Interest Rates Higher Than Bank Deposits

ఆర్బీఐ గుడ్ న్యూస్.. బ్యాంక్ డిపాజిట్లకు మించి వడ్డీ

  • Author : Vamsi Chowdary Korata Date : 01-01-2026 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rbi
Rbi

RBI Saving : ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశాయి. దీంతో ఇవి క్రమంగా ఆకర్షణ కోల్పోతున్నాయి. పోస్టాఫీస్ పథకాల్లోనూ వడ్డీ రేట్లు అంత ఆకర్షణీయంగా ఏం లేవు. అయితే ఇదే సమయంలో ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ఇక్కడ వడ్డీ రేటు ఏకంగా 8 శాతానికిపైగానే ఉండటం విశేషం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేట్లను గతేడాది వరుసగా తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా 25, 25, 50, 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం కోత విధించింది. ఈ క్రమంలో ఇది 6.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించగా.. బ్యాంకులు వెంటనే లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గించేశాయి. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠాలకు పడిపోగా ఇవి క్రమంగా ఆకర్షణ కోల్పోతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆర్బీఐ ఆఫర్ చేసే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఇందులో చాలా వరకు బ్యాంక్ డిపాజిట్లకు మించి వడ్డీ రేటు ఉంది. అదే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్ .

ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి- మార్చి) సంబంధించి.. కేంద్ర ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈసారైనా వడ్డీ రేట్లు పెరుగుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. దీంతో ఇక్కడ కూడా ఒకటి, రెండు పథకాలకు మించి వడ్డీ రేట్లు మరీ ఆకర్షణీయంగా ఏం లేవు. కానీ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ పథకంలో ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా ప్రభుత్వ మద్దతుతోనే నడిచే స్కీమ్. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితికి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఆర్బీఐ బాండ్లలో ఎంతైనా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఈ స్కీమ్ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటుతో ముడిపడి ఉంటుంది. NSC వడ్డీ రేటు కంటే 0.35 శాతం అధికంగా ఉంటుంది. NSE వడ్డీ రేటు మారితే.. దానికి అనుగుణంగా ఈ ఆర్బీఐ బాండ్ వడ్డీ రేట్లు మారతాయి. ఏటా జనవరి 1, జులై 1న ఈ కొత్త రేట్లను ప్రకటిస్తుంది ఆర్బీఐ. ఇప్పుడు జనవరి 1న వీటి రేట్లను 8.05 శాతంగా స్థిరంగానే ఉంచుతూ ప్రకటన వెలువరించింది.

ఆర్బీఐ గోల్డ్ బాండ్ కాల పరిమితి 7 సంవత్సరాలు. ఇందులో కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఏడేళ్ల వరకు డబ్బులు బయటికి వద్దనుకుంటే ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెనాల్టీతో ముందుగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

చాలా ప్రముఖ బ్యాంకుల్లో లాంగ్ టర్మ్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 6-7 శాతం మధ్యే ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా ఎఫ్‌డీపై 6.6 శాతం వడ్డీనే ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.7 శాతం, ఎస్బీఐ 6.45 శాతం, యూనియన్ బ్యాంక్ 6.3 శాతం వడ్డీనే అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్ 7.2 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 6.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 6.6 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. దీంతో వీటన్నింటికంటే ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Interest Rates
  • rbi
  • RBI Interest Rates
  • RBI Repo Rate
  • RBI Saving Bonds Interest Rate

Related News

2000 Rupee Notes

రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

మీ ఇంట్లో ఎక్కడైనా ఆ గులాబీ నోటు దాగి ఉంటే అస్సలు కంగారు పడకండి. అది కేవలం కాగితం ముక్కగా మారిపోలేదు. దానిని మార్చుకోవడానికి మీరు కొంచెం శ్రమించి, నేరుగా RBIని సంప్రదించాలి.

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd