Priti Adani: గౌతమ్ అదానీ విజయం వెనుక భార్య.. ప్రీతి అదానీ గురించి తెలుసుకోవాల్సిందే..!
- By Gopichand Published Date - 11:10 AM, Sun - 2 June 24
![Priti Adani: గౌతమ్ అదానీ విజయం వెనుక భార్య.. ప్రీతి అదానీ గురించి తెలుసుకోవాల్సిందే..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/safeimagekit-pgpg2_11zon.jpg)
Priti Adani: దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్న వ్యక్తి. గౌతమ్ విజయం వెనుక అతని కృషి ఉందనడంలో సందేహం లేదు. అయితే ఇందులో స్త్రీ సహకారం కూడా తక్కువేమీ కాదన్న విషయం మరువకూడదు. ఈ మహిళ గౌతమ్ అదానీతో నీడలా ఉంటుంది. అతని వ్యాపారంలో అతనికి సహాయం చేస్తుంది. ఈ మహిళ పేరు ప్రీతి అదానీ.
గౌతమ్ అదానీతో ప్రత్యేక అనుబంధం ఉంది
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ప్రీతీ అదానీ (Priti Adani)కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె గౌతమ్ అదానీ భార్య. గౌతమ్ అదానీ తన సక్సెస్ క్రెడిట్‌ని అతని భార్య ప్రీతికి ఇచ్చాడు. తాను హైస్కూల్ పాస్ అయ్యానని, ప్రీతి క్వాలిఫైడ్ డాక్టర్ అని గౌతమ్ స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ప్రీతి అదానీ దేశంలోని అతిపెద్ద NGOలలో ఒకటైన అదానీ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ NGO దేశంలోని అనేక సంఘాల కోసం సామాజిక సేవ చేస్తుంది. విద్య, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)కి సహకారం కారణంగా 2020 సంవత్సరంలో గుజరాత్ న్యాయ విశ్వవిద్యాలయం ఆమెకి డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది.
ప్రీతి అదానీ డెంటిస్ట్
ప్రీతి అదానీ దంతవైద్యురాలు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (BDS) కలిగి ఉన్నారు. గుజరాత్ కుటుంబంలో 1965లో జన్మించిన ప్రీతి 1986లో గౌతమ్ అదానీని వివాహం చేసుకున్నారు. అప్పటికి ప్రీతికి 21 ఏళ్లు. గౌతమ్ అదానీకి 24 ఏళ్లు. 1996లో అదానీ ఫౌండేషన్‌కు పునాది వేశారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి సంబంధించి గ్రామాలు, నగరాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని లక్ష్యం. నేడు అదానీ ఫౌండేషన్ దేశంలోని 18 రాష్ట్రాల్లోని 5753 కంటే ఎక్కువ గ్రామాల్లో చురుకుగా ఉంది. ప్రస్తుతం ప్రీతీ అదానీ నికర విలువ ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8326 కోట్లు).
Also Read: Sunita Williams: సునీత విలియమ్స్ అంతరిక్షయానం మళ్లీ వాయిదా.. ఈ సారి రీజన్ ఇదే..!
అదానీ తన విజయానికి క్రెడిట్‌ను ప్రీతికి ఇచ్చాడు
గౌతమ్ అదానీ తన విజయానికి తన భార్య ప్రీతి చాలా దోహదపడిందని చాలాసార్లు ఒప్పుకున్నాడు. ఉన్నత చదువులు చదివినా తనను పెళ్లి చేసుకున్నందుకు ప్రీతిని మెచ్చుకున్నాడు. తాను హైస్కూల్ పాస్ కాలేజ్ డ్రాపౌట్ అని, ప్రీతి క్వాలిఫైడ్ డాక్టర్ అని ఇటీవలే చెప్పాడు. క్వాలిఫికేషన్లో ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రీతి మాత్రం పెళ్లి చేసుకుంటూ ఓ బోల్డ్ డెసిషన్ తీసుకుందన్నారు.
We’re now on WhatsApp : Click to Join
తండ్రి.. ప్రీతిని పెళ్లికి ఒప్పించాడు
ప్రీతి, గౌతమ్‌లు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ప్రీతీకి గౌతమ్ అదానీ మొదటి చూపులోనే నచ్చలేదు. ఆ సమయంలో ప్రీతి డెంటిస్ట్ చదువుతోంది. ప్రీతి తండ్రి సేవంతీలాల్కి గౌతమ్ సామర్థ్యాలపై నమ్మకం ఉండేది. అతను ప్రీతిని పెళ్లికి ఒప్పించాడు. వారి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ప్రీతి, గౌతమ్‌లు కలిసినప్పుడు ప్రీతి ఆలోచన అతని వైపు పూర్తిగా మారిపోయింది. ఆమె పెళ్లికి ఓకే చెప్పింది. వారిద్దరూ 1986లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం ప్రీతి తన కెరీర్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది. అదానీ ఫౌండేషన్‌ను స్థాపించి దాని చైర్‌పర్సన్‌గా మారింది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![UK Elections: బ్రిటన్ ఎన్నికలు.. భారత సంతతికి చెందిన 28 మంది గెలుపు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-Untitled-design-2-1_11zon.png)
UK Elections: బ్రిటన్ ఎన్నికలు.. భారత సంతతికి చెందిన 28 మంది గెలుపు..!
బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో (UK Elections) భారతీయ సంతతికి చెందిన 28 మంది ఎంపీలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.