New GST Rate: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పాలు, నెయ్యి ధరలు!
కొన్ని వస్తువులకు 0 శాతం, మరికొన్నింటికి 5 శాతం జీఎస్టీ వర్తించడం వల్ల ధరలు తగ్గాయి. ఈ మార్పు వల్ల డిమాండ్ పెరిగి, పెద్ద లాభాలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
- By Gopichand Published Date - 03:58 PM, Tue - 16 September 25

New GST Rate: వస్తువులు, సేవల పన్ను (New GST Rate) కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి ముందు పాలు, నెయ్యి, వెన్నతో సహా అనేక ఆహార పదార్థాల కొత్త ధరల జాబితా కూడా విడుదలైంది. అవును జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రాకముందే మదర్ డెయిరీ తన పాలు, నెయ్యి, పనీర్, చీజ్ మొదలైన వాటి ధరలను తగ్గించి కొత్త జాబితాను విడుదల చేసింది.
వస్తువుల కొత్త ధరలు ఇలా ఉంటాయి
కొత్త రేట్ల జాబితా ప్రకారం.. ఒక లీటర్ టెట్రా ప్యాక్ పాలు గతంలో 5 శాతం జీఎస్టీతో రూ. 77కు లభించగా, ఇప్పుడు రూ. 75కు లభిస్తుంది. రూ. 750 ఉన్న నెయ్యి టిన్ ఇప్పుడు రూ. 720కి లభిస్తుంది. 200 గ్రాముల పనీర్ రూ. 95 ఉండగా ఇప్పుడు రూ. 92కి లభిస్తుంది. 200 గ్రాముల చీజ్ స్లైస్ రూ. 170 ఉండగా, ఇప్పుడు రూ. 160కి లభిస్తుంది.
400 గ్రాముల పనీర్ ప్యాకెట్ రూ. 180 ఉండగా, ఇప్పుడు రూ. 174కు లభిస్తుంది. 200 గ్రాముల మలై పనీర్ ప్యాక్ రూ. 100 ఉండగా ఇప్పుడు రూ. 97కి తగ్గింది. మదర్ డెయిరీ టెట్రా ప్యాక్ పాల 450 ఎంఎల్ ప్యాక్ గతంలో రూ. 33 ఉండగా.. ఇప్పుడు రూ. 32కి లభిస్తుంది. 180 ఎంఎల్ మిల్క్‌షేక్ ప్యాక్ ఇప్పుడు రూ. 30కి బదులుగా రూ. 28కు లభిస్తుంది.
Also Read: HYD Metro : నష్టాల నుండి బయటపడేందుకు వాటాలను అమ్మేస్తున్న L&T
2 నుండి 3 రూపాయల వరకు తగ్గిన ధరలు
జీఎస్టీ కొత్త రేట్లను ప్రకటించిన తర్వాత మదర్ డెయిరీ తన వినియోగదారులకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ ప్రతి వస్తువు ధరను 2 నుండి 3 రూపాయల వరకు తగ్గించింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉపయోగించే నిత్యావసర ఆహార పదార్థాలు ఇప్పుడు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. దీనివల్ల మదర్ డెయిరీ కంపెనీ మొత్తం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు పెద్ద లాభం చేకూరింది.
కొన్ని వస్తువులకు 0 శాతం, మరికొన్నింటికి 5 శాతం జీఎస్టీ వర్తించడం వల్ల ధరలు తగ్గాయి. ఈ మార్పు వల్ల డిమాండ్ పెరిగి, పెద్ద లాభాలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న జీఎస్టీ కొత్త రేట్లను ప్రకటించింది. ఇప్పుడు జీఎస్టీ రేట్లు కేవలం 5- 12 శాతం మాత్రమే ఉన్నాయి. అవి రాబోయే సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.