LPG Price Update: కాసేపట్లో బడ్జెట్.. ముందే గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్!
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ.7 తగ్గింపు తర్వాత రూ.1797కి అందుబాటులో ఉంటుంది. గత నెలలో సిలిండర్ ధర రూ.1804గా ఉంది.
- By Gopichand Published Date - 08:26 AM, Sat - 1 February 25

LPG Price Update: నేడు కేంద్రం బడ్జెట్ కంటే ముందు దేశప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌కు ముందు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Update) చౌకగా మారింది. చమురు మార్కెట్ కంపెనీలు మరోసారి సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.7 తగ్గింది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ అంటే నేటి (శనివారం) నుంచి అమలులోకి వచ్చాయి. 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత ధరకు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
ప్రముఖ నగరాల్లో ధరలు
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ.7 తగ్గింపు తర్వాత రూ.1797కి అందుబాటులో ఉంటుంది. గత నెలలో సిలిండర్ ధర రూ.1804గా ఉంది. కోల్‌కతాలో సిలిండర్ రూ.4 తగ్గింపు తర్వాత రూ.1907కి అందుబాటులో ఉంటుంది. గత నెల జనవరిలో ఈ ధర రూ.1911గా ఉంది. ముంబైలో రూ. 6.5 తగ్గింపు తర్వాత 19 కిలోల సిలిండర్ రూ.1749.5కి అందుబాటులో ఉంటుంది. గత నెలలో ఈ ధర రూ.1756కి అందుబాటులో ఉంది. రూ.6.5 తగ్గింపు తర్వాత 19 కిలోల సిలిండర్ చెన్నైలో రూ.1959.5కి లభిస్తుంది. గత నెలలో సిలిండర్ ధర రూ.1966గా ఉంది.
Also Read: Plane Crash : షాపింగ్ మాల్‌పైకి దూసుకెళ్లిన విమానం.. ఆరుగురు మృతి
వరుసగా రెండో నెల కూడా సిలిండర్ ధరలు తగ్గాయి
గత నెలలో కూడా వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గిన విషయం తెలిసిందే. అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) జనవరి 2025 నెలలో 6 నెలల్లో మొదటిసారిగా 19 కిలోల సిలిండర్ ధరను రూ. 14.5 తగ్గించింది. మెట్రో నగరాల్లో రూ.16 వరకు తగ్గింది. ఫిబ్రవరిలో వరుసగా రెండో నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గగా, ఈసారి రూ.4 నుంచి రూ.7 వరకు తగ్గాయి.
ఆగస్టు 1, 2024 నుండి 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలలో చమురు కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. ఫిబ్రవరి 2025లో కూడా 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.