Kenya Cancels Deal With Adani: అదానీకి మరో బిగ్ షాక్.. డీల్ క్యాన్సిల్ చేసుకున్న కెన్యా!
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. అదానీ గ్రూప్‌తో కెన్యా అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని ప్రకటించారు.
- Author : Gopichand
Date : 21-11-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
Kenya Cancels Deal With Adani: గౌతమ్ అదానీపై (Kenya Cancels Deal With Adani) అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్స్‌కి కెన్యా షాకిచ్చింది. 700 మిలియన్ డాలర్ల విలువ చేసే విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాన్ని విస్తరించడానికి ఉద్దేశించిన టెండర్‌ను రద్దు చేయనున్నట్లు పేర్కొంది.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. అదానీ గ్రూప్‌తో కెన్యా అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని ప్రకటించారు. అదానీ గ్రూప్‌తో ఎయిర్‌పోర్టు విస్తరణ, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వంటి ఒప్పందాలను ముగించుకుంటున్నామని తెలిపింది. అదానీకి రూ.2,029 కోట్ల (265 మిలియన్ డాలర్లు) లంచం ఇచ్చారని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో కెన్యా ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు!
భారత్‌కు చెందిన అదానీ కంపెనీతో ఎయిర్‌పోర్టు విస్తరణ, పవర్ ట్రాన్స్‌మిషన్ ఒప్పందాలు రెండింటినీ తమ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు తెలిపారు. అదానీ గ్రూప్ విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాల్సి ఉంది. 30 ఏళ్లుగా గత నెలలో కుదుర్చుకున్న ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. విమానాశ్రయ విస్తరణ కోసం అదానీ గ్రూప్ 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది.
భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌లను పొందడానికి అనుకూలమైన నిబంధనలకు బదులుగా భారతీయ అధికారులకు 265 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,200 కోట్లు) లంచం ఇచ్చారని ఆరోపిస్తూ గౌతమ్ అదానీ ప్రమేయం ఉందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. US ప్రాసిక్యూటర్ల పత్రాల ప్రకారం.. దేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జూలై 2021- డిసెంబర్ 2021 మధ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడుతో విద్యుత్ విక్రయ ఒప్పందాలను కుదుర్చుకుంది.