Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!
తాజా సమాచారం ప్రకారం.. భారతీయ రైల్వే తొలిసారిగా ఒక ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా ప్రయాణీకులు తమ రిజర్వ్ చేయబడిన టికెట్ల తేదీలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు.
- By Gopichand Published Date - 07:40 PM, Wed - 8 October 25
Indian Railways: భారతీయ రైల్వే (Indian Railways) రాబోయే రోజుల్లో తొలిసారిగా కన్ఫర్మ్ టికెట్ల తేదీని మార్చుకునే ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే అత్యవసర పరిస్థితుల్లో టికెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఆన్‌లైన్‌లోనే కన్ఫర్మ్ అయిన టికెట్ తేదీని మార్చుకుని, అదే టికెట్‌పై మరో రోజున ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టికెట్ రద్దు చేసుకుంటే ఎక్కువ మొత్తంలో క్యాన్సిలేషన్ ఛార్జ్ చెల్లించాల్సి వస్తోంది. కొత్త సదుపాయం అమలులోకి వస్తే మీ క్యాన్సిలేషన్ ఛార్జ్ ఆదా అవుతుంది.
ప్రస్తుత విధానం, రాబోయే మార్పు
ప్రస్తుతం రైల్వే టికెట్ల తేదీలలో మార్పు చేసుకోవడానికి రైలు బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు టికెట్ కౌంటర్లలో మాత్రమే ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది. దీనికి అదనంగా కూడా చెల్లించాలి.
Also Read: Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?
తాజా సమాచారం ప్రకారం.. భారతీయ రైల్వే తొలిసారిగా ఒక ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా ప్రయాణీకులు తమ రిజర్వ్ చేయబడిన టికెట్ల తేదీలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ కొత్త సేవ జనవరి 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెరుగైన ప్రయాణీకుల సదుపాయం కోసం రైల్వే సేవలను డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్లడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. దీనివల్ల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి, ప్రయాణీకుల సమయం ఆదా అవుతుంది.