Indian Aviation History: చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఒక్కరోజులో 5 లక్షల మంది ట్రావెల్!
దీపావళి తర్వాత విమాన ప్రయాణాలు భారీగా పెరిగాయి. ఇందులో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది.
- By Gopichand Published Date - 03:00 PM, Mon - 18 November 24

Indian Aviation History: దేశవ్యాప్తంగా రోజురోజుకూ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. నవంబర్ 17వ తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో (Indian Aviation History) 5 లక్షల మందికిపైగా ప్రయాణించారనే వాస్తవాన్ని బట్టి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. నివేదిక ప్రకారం అన్ని ఎయిర్‌లైన్స్‌లో 3173 దేశీయ విమానాల్లో 5,05,412 మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారు. ఇది గత వారంతో పోలిస్తే విమాన ప్రయాణంలో కొనసాగుతున్న పెరుగుదలను చూపుతోంది. అంతకుముందు నవంబర్ 8న ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 4.9 లక్షలుగా నమోదైంది.
నవంబర్ 17న దేశీయ విమానాలు
దీపావళి తర్వాత విమాన ప్రయాణాలు భారీగా పెరిగాయి. ఇందులో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 17 నాటి డేటాను పరిశీలిస్తే దేశీయ ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉండగా.. 5,05,412 మంది ప్రయాణికులకు 3173 విమానాలు నడపబడ్డాయి. నవంబర్ 8వ తేదీ డేటాను పరిశీలిస్తే ఆ రోజు 4.9 లక్షలు, నవంబర్ 9న 4.96 లక్షలు, నవంబర్ 14న 4.97 లక్షలు, నవంబర్ 15న 4.99 లక్షలు, నవంబర్ 16న 4.98 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Also Read: Mahesh : మహేష్ లుక్కు మార్చేశాడు.. న్యూ లుక్ చూశారా..?
దీపావళి రోజున ప్రయాణికులు ఎందుకు తక్కువగా ఉన్నారు?
సాధారణంగా పండుగ సీజన్‌లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. ఈసారి దీపావళి సందర్భంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇంతకుముందు క్యూ2-ఎఫ్‌వై25 ఫలితాలను ప్రకటించినప్పుడు ఇండిగో వరుసగా ఏడు త్రైమాసికాల లాభాల తర్వాత నష్టాన్ని నివేదించింది. దీపావళి తర్వాత విమాన ప్రయాణాలు పెరగడం వెనుక పెళ్లిళ్ల సీజన్, పాఠశాలలకు సెలవులు కారణమని భావిస్తున్నారు.
ఈ నెలలో ప్రతిరోజు సగటున 3161 విమానాలు తమ సేవలను అందించాయి. ఇది గత నెల కంటే దాదాపు 8 విమానాలు ఎక్కువ. కానీ ఈ సంఖ్య దీపావళి రోజుల్లో విమానాల సంఖ్య కంటే తక్కువ. గత కొన్ని రోజులుగా ఇండిగో ప్రయాణికులు తమ ప్రయాణంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇందులో విమానయాన సంస్థ షెడ్యూల్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి వార్తల మధ్య ప్రయాణికుల సంఖ్య పెరగడం విమానయాన సంస్థకు శుభసూచకం.