Mahesh : మహేష్ లుక్కు మార్చేశాడు.. న్యూ లుక్ చూశారా..?
Mahesh ఎప్పుడూ లేని విధంగా లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో మహేష్ కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ పెరిగిన జుట్టుతో బయట కనిపిస్తున్నాడు. రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందో
- By Ramesh Published Date - 02:51 PM, Mon - 18 November 24

సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతునాడు. ఈ సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చేస్తున్నాడు మహేష్. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో మహేష్ కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ పెరిగిన జుట్టుతో బయట కనిపిస్తున్నాడు. రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ మహేష్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐతే లేటెస్ట్ గా మహేష్ (Mahesh) గడ్డం ని ట్రిం చేసి కనిపించాడు. కీరవాణి తనయుడు శ్రీ సింహా (Sri Simha) మ్యారేజ్ లో మహేష్ కొత్త లుక్ సర్ ప్రైజ్ చేశాడు. మహేష్ గడ్డం ట్రిం చేయడంతో అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. రాజమౌళి (Rajamouli) సినిమా కోసం మహేష్ ఇన్నేళ్లలో ఎప్పుడు లేనిది కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.
హాలీవుడ్ టెక్నికల్ టీం..
ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నికల్ టీం కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో బయటకు రాబోతుంది. 2025 జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. 2025 సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. రెండేళ్ల టైం ను షూటింగ్ కు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా తప్పకుండా రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని తెలుస్తుంది.
Also Read : Pushpa 2 : పుష్ప పార్టీ ఎప్పుడు..రాజమౌళి ట్వీట్