HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Hit Rock Bottom

Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. పాతాళానికి బంగారం ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2026 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Rate
Today Gold Rate

Gold Price Today  బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే శుభవార్త. ప్రతిరోజూ బంగారం ధరలు దిగొస్తూనే ఉన్నాయి. కిందటి రోజు భారీగా తగ్గగా.. ఇవాళ కూడా రూ. 1000 కి పైగానే ధర తగ్గుముఖం పట్టింది. వెండి ధర రూ. 5 వేలు తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మరోసారి బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ కనిపించింది. స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజులోనే 200 డాలర్లకు పైగా పతనమైంది.

22k Gold Rate Today: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు రోజురోజుకూ దిగొస్తుండటం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో.. సంక్షోభాల సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు.. ఇంకా సీన్ రివర్స్‌లో ఉంది. ధర పెరగడం కాదు కదా స్థిరంగా కూడా ఉండట్లేదు.. ఇదే క్రమంలో భారీగా పతనం అవుతోంది. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా.. ఈ 20 రోజుల్లో 3-4 రోజులు మాత్రమే అది కూడా ధర స్వల్పంగానే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మార్చి 21న ఉదయం 7 గంటల సమయంలో కూడా ధర తగ్గినట్లే చూపిస్తోంది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ (మార్చి 21) రూ. 1200 తగ్గడంతో తులం ప్రస్తుతం రూ. 1,36,550 కి దిగొచ్చింది. ముందటి రోజు ఇది రూ. 6550 తగ్గింది. దానికి ముందు కూడా వారం వ్యవధిలో వరుసగా రూ. 600, రూ. 2050, రూ. 950, రూ. 1400, రూ. 1000 ఇలా వరుసగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో మార్చి 17న రూ. 600 పెరిగింది. అంతకుముందు కూడా ధరలు తగ్గుతూనే వచ్చాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే మార్చి 21 ఉదయం 7 గంటల సమయంలో రూ. 1370 తగ్గి 10 గ్రాములకు రూ. 1,48,910 వద్ద ట్రేడ్ అవుతోంది. కిందటి రోజు ఇది రూ. 7 వేలకు పైగా తగ్గుముఖం పట్టింది.

బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మార్చి 21న ప్రస్తుతం వార్త రాసే సమయంలో చూస్తే సిల్వర్ రూ. 5 వేలు తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 2.60 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా రూ. 10 వేలు, రూ. 5 వేల చొప్పున తగ్గింది. ఇది వారం వ్యవధిలో రూ. 30 వేల వరకు తగ్గుముఖం పట్టింది.

మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4492 డాలర్ల వద్ద ఉంది. కిందటి రోజు ఉదయం ఇది 4700 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజులోనే 200 డాలర్లకు పైగా పడిపోయింది. సిల్వర్ రేటు 67.97 డాలర్ల వద్ద ఉంది. కిందటి రోజు ఇది 75 డాలర్ల స్థాయిలో ఉండేది. 10 శాతం వరకు తగ్గిందన్నమాట. ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 93.57 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24 Carat Gold Rate
  • 24K gold price
  • Global Gold Prices
  • gold price
  • Gold Price Today
  • Gold price today India
  • gold sliver
  • sliver price

Related News

Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price : ఆగని బంగారం ధర..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పైముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు, నేడు స్వల్పంగా పెరగడం వినియోగదారులను ఆందోళన

  • Gold Price

    Gold Price Rise : మరోసారి షాక్ ఇచ్చిన బంగారం ధర

  • Gold Price March 30

    Gold Price Down Today : బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Gold Price March 30

    Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

Latest News

  • US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన చర్చలు

  • Amazon : అమేజాన్ సమ్మర్ సేల్ – పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై 50% వరకు భారీ తగ్గింపు!

  • Maruti Suzuki : మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజులో 108 ఇ-విటారా కార్ల డెలివరీ

  • Stock Market : మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలా? మీ పోర్ట్‌ఫోలియోలో ‘బంగారం’ ఎందుకు ఉండాలో తెలుసుకోండి!

  • Vaibhav Suryavanshi : జాతీయ జట్టులోకి వైభవ్ ఖరారు !!

Trending News

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd