HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Enthusiasts Gold Prices Are Plummeting

Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త! కుప్పకూలుతున్న బంగారం ధరలు.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2026 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price Today
Gold Price Today

Gold Rate  పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే వార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.10 వేల మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా పసిడి రేట్లు భారీగా పడిపోతుండడం గమనార్హం. ఇక కిలో వెండి రేటు ఇవాళ ఏకంగా రూ.20 వేల మేర పడిపోయింది. ఈ క్రమంలో మార్చి 24వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు, కిలో వెండి రేటు ఎంతకు దిగివచ్చాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇంతకు మించిన మంచి సమయం రాదనే చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ ధరలు దిగివచ్చాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా పరిస్థితులను ఎవరూ ఊహించలేకపోతున్నారు. యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి బంగారం, వెండి వంటి విలువైన లోహాలు సురక్షితమైన పెట్టుబడి హోదాను కోల్పోతున్నాయి. అటు అమెరికా డాలర్ విలువ పెరగడం, బాండ్ ఈల్డ్స్ హైరిటర్న్స్ ఇస్తుండడం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వంటి కారణాలు బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు దోహదం చేస్తున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధం జరుగుతున్నా బంగారం ఆకర్షణ కోల్పోయి ధరలు భారీ స్థాయిలో పతనమవుతున్నాయంటున్నారు. ఈ క్రమంలో మార్చి 24వ తేదీన తులం బంగారం రేటు ఏకంగా రూ.10 వేలకు పైగా దిగివచ్చింది. కిలో వెండి రేటు రూ.20 వేల మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఈరోజు 108 డాలర్ల మేర తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4382 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు కాస్త పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 0.82 శాతం వృద్ధితో 68.43 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏకంగా రూ.10,320 మేర దిగిరావడం గమనార్హం. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,35,650 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల 916 ప్యూరిటీ గల బంగారం ధర 10 గ్రాములకు రూ.9,450 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ. 1,24,350 వద్దకు దిగివచ్చి అమ్ముడవుతోంది.

రూ.20 వేలు తగ్గిన వెండి

బంగారంతో పాటు వెండి రేటు సైతం కుప్పకూలుతోంది. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి దాదాపు రూ.2 లక్షల మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.20,000 దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ. 2,30,000 వద్ద ట్రేడవుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 24వ తేదీ మంగళవారం రోజున ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నం వరకు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకునే వారు స్థానికంగా ఉండే ధరలను ఖరీదు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24K gold price
  • Andhra Pradesh Gold Rate
  • Check Gold Rates
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold prices drop—a great opportunity for buyers.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd