Gold Rate Hike: బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ. 1,04,800కి చేరుకుంది. మొన్నటి ధర రూ. 1,03,650గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల బంగారం రూ. 11,500 పెరిగి రూ. 10,48,800కి చేరింది. మొన్నటి ధర రూ. 10,36,500గా ఉంది.
- By Gopichand Published Date - 05:00 PM, Wed - 24 September 25

Gold Rate Hike: బంగారం ధరలు (Gold Rate Hike) తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న కూడా ఎంసిఎక్స్ (MCX)లో బంగారం ధరలు రూ. 1800 పెరిగాయి. మల్టీ కమోడిటీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,990గా ఉంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రారంభంలో $3,759.02 రికార్డు స్థాయికి చేరిన తర్వాత బంగారం 0.2% పెరిగి $3,753.25 డాలర్లకు చేరుకుంది. అయితే డిసెంబర్ డెలివరీ కోసం అమెరికన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% పెరిగి $3,787.40 డాలర్లకు చేరుకుంది.
ఈ మధ్యే జేపీ మోర్గాన్ సీఈఓ జెమీ డిమన్ బంగారం ధరల్లో భారీ పతనం ఉండొచ్చని హెచ్చరించారు. ముంబైలో జరిగిన జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో డిమన్ ఈ ప్రమాద ఘంటికలను మోగించారు.
బంగారంలో ఇంత పెరుగుదల ఎందుకు?
అమెరికన్ ఫెడ్ రేట్లలో భారీ కోత తర్వాతే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. క్యాపిటల్.కామ్ నిపుణుడు కైల్ రోడా మాట్లాడుతూ.. ఇది ప్రధానంగా ద్రవ్య విధాన అంచనాలు, తక్కువ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణానికి పెరుగుతున్న ప్రమాదాల కారణంగా జరిగిందని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు.
Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
22 క్యారెట్ల బంగారం ధర ఎంత పెరిగింది?
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ. 1,04,800కి చేరుకుంది. మొన్నటి ధర రూ. 1,03,650గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల బంగారం రూ. 11,500 పెరిగి రూ. 10,48,800కి చేరింది. మొన్నటి ధర రూ. 10,36,500గా ఉంది.
బంగారం ధరలు తగ్గుతాయా?
కొంతమంది విశ్లేషకులు సాంకేతిక కారణాల వల్ల బంగారం ధరలు త్వరలోనే తగ్గుతాయని అంచనా వేస్తున్నారు, అయితే విస్తృత ధోరణి సానుకూలంగానే ఉంది. ఓఆండీఏ (OANDA) సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు కెల్విన్ వాంగ్ మాట్లాడుతూ.. స్వల్పకాలంలో ఇంకా వృద్ధి ఉంది. కానీ సాంకేతిక కారకాల వల్ల స్వల్పకాలంలో ధరలు తగ్గుతాయని మేము ఆశిస్తున్నాము అన్నారు.