Gold Price Today: మరోసారి భగ్గుమన్న బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే?
ఈ ఏడాది అక్టోబర్- డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ మరో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్లు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా బంగారం ధరలకు కీలకమైన మద్దతు ఇస్తోంది.
- By Gopichand Published Date - 11:03 AM, Tue - 7 October 25

Gold Price Today: మంగళవారం (అక్టోబర్ 7) ట్రేడింగ్‌లో బంగారం- వెండి ధరలు (Gold Price Today) సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారులకు అద్భుతమైన వార్త అందింది. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు దూసుకెళ్లడానికి అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం, ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెరుగుతున్న సురక్షిత పెట్టుబడి డిమాండ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి.
అగ్రస్థానంలో దేశీయ ధరలు
MCX గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,20,879 తో రికార్డు గరిష్టాన్ని తాకాయి. ఉదయం 9:45 గంటల ప్రాంతంలో 10 గ్రాముల బంగారం రూ. 1,20,840 వద్ద, కిలో వెండి రూ. 1,47,666 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read: Municipal Election : డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు?
పెరుగుదలకు కారణాలు
ఈ ఏడాది అక్టోబర్- డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ మరో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్లు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా బంగారం ధరలకు కీలకమైన మద్దతు ఇస్తోంది. US ప్రభుత్వ షట్‌డౌన్, ఫ్రాన్స్‌లోని రాజకీయ గందరగోళం వంటి అనిశ్చితుల కారణంగా ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తి అయిన బంగారంలోకి భారీగా మళ్లుతున్నారు. దేశీయంగా రిటైల్, సంస్థాగత కొనుగోళ్లు ఊపందుకోవడంతో పాటు ETF (Exchange Traded Fund) పెట్టుబడిదారులు వెండి, బంగారాలలో చురుకుగా పెట్టుబడి పెట్టడం ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ స్పాట్ బంగారం ధరలు 55 శాతం కంటే ఎక్కువ పెరగడం, ఈ రంగంలో పెట్టుబడి ఎంత లాభదాయకమో నిరూపిస్తోంది.
కొనుగోలుకు అవకాశం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు ఈ గరిష్ట స్థాయిల నుండి కాస్త వెనక్కి తగ్గినట్లయితే మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే పెట్టుబడిదారులకు అది కొనుగోలు చేయడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. పృథ్విఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ అయితే వెండిని రూ. 1,47,000 వద్ద కొనుగోలు చేయాలని, రూ. 1,50,000 లక్ష్యం కోసం ట్రేడ్ చేయాలని సూచిస్తున్నారు.