HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Plummet

Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. కిందటి రోజు భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గిన క్రమంలోనే బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా గరిష్ఠాల నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు భారీ స్థాయిలో దిగొచ్చాయని చెప్పొచ్చు.

పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల కొంత కాలంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు మే 2న మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కిందటి రోజు భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు సడెన్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటల సమయంలో రూ. 300 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,350 వద్ద ఉంది. దీనికి ముందు రోజు చూస్తే ఏకంగా రూ. 1950 తగ్గింది. దానికి ముందు రోజు రూ. 2100 పెరిగింది. అంతకుముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 మేర తగ్గుతూ వచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ స్వల్పంగా రూ. 330 పెరగడంతో తులం రూ. 1,50,930 వద్ద ఉంది. ఇది ముందు రోజు రూ. 2130 తగ్గగా.. దానికి ముందు రూ. 2290 పెరిగింది. అంతకుముందు వరుసగా రూ. 490, రూ. 2780, రూ. 330 తగ్గుముఖం పట్టింది.

ఇక మరోవైపు వెండి ధరల్ని చూస్తే మే 2 సెషన్‌లో రూ. 5 వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు రోజు రూ. 5 వేలు తగ్గగా.. దానికి ముందు రూ. 10 వేలు పెరిగింది. అంతకుముందు ఏప్రిల్ 28, 29 సెషన్లలో వరుసగా రూ. 5 వేల చొప్పున తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లు కిందటి రోజు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. భారీగా తగ్గి.. మళ్లీ పెరిగి తిరిగి యథాతథ స్థితికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4615 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు చూస్తే 75.39 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనం అవుతోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి రూ. 94.93 వద్ద ట్రేడవుతోంది.

కొద్ది రోజుల కిందటి వరకు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగ్గా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కిందటి రోజు కూడా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు ఒక దశలో 126 డాలర్ల స్థాయికి చేరుకోగా బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఏమైందో ఏమో మళ్లీ క్రూడాయిల్ ధర 113 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 Carat Gold Rate
  • 22K gold price
  • 22K gold rate
  • 24 Carat Gold Price
  • 24 Carat Gold Rate Down
  • Andhra Pradesh Gold Rate
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

    Latest News

    • Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ పై ఐటీ శాఖ ఫోకస్

    • Gas Price : స్టార్ హోటళ్లను తాకిన గ్యాస్ మంట.. భారీగా పెరగనున్న ధరలు!

    • Pawan : హీరో నానికి..ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్

    • IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తార‌ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: స‌ల్మాన్ ఆఘా

    • Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd