HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Have Changed Suddenly

Gold Price: ఒక్కసారిగా మారిన బంగారం వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 06-05-2026 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Price
Today Gold Price

పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడం, అమెరికా నౌకలపై బాంబులు వేయడం వంటి కారణాలతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 100 డాలర్లు పెరగడం గమనార్హం. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపించింది. ఈ క్రమంలో మే 6వ తేదీన హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ.2000 పెరగడం గమనార్హం. అయితే, అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. అలాగే హార్ముజ్ జల సంధి వద్దకు వస్తున్న అమెరికా నౌకలపైనా దాడులు చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని నౌకలను పేల్చేసినట్లు అమెరికా సైతం ప్రకటించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపించింది. ఆసియా సహా భారత మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. రెండు రోజులుగా తగ్గిన ధర ఒక్కరోజులోనే పెరిగింది. ఈ క్రమంలో మే 6వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పెరిగాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం రేటు దాదాపు 100 డాలర్ల మేర దూసుకెళ్లడం గమనార్హం. ఈ వార్త రాసే సమయానికి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 91.95 డాలర్లు పెరిగి 4650 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 3.58 శాతం మేర పెరిగి 75.72 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు రోజుల్లో తగ్గినా ఈరోజు భారీగా పెరగడం గమనార్హం. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2130 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,310 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1950 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,38,700 వద్దకు దూసుకెళ్లింది.

బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగానే పెరిగింది. క్రితం రోజు రూ.5 వేలు దిగొచ్చిన వెండి రేటు ఈరోజు మళ్లీ రూ.5000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,70,000 మార్కు వద్దకు చేరుకుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • 24K gold rate
  • Daily gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold prices drop—a great opportunity for buyers.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd