HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Even The Unemployed Can Get A Credit Card Learn This Easy Trick

ఆదాయం లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.. ఎలాగంటే?!

మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా మంచి బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేస్తుంటే మీ లావాదేవీల హిస్టరీని బట్టి బ్యాంకులు స్వయంగా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తాయి.

  • Author : Gopi Date : 05-01-2026 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Credit Card
Credit Card

Credit Card: బంధువులు కూడా ఆదుకోని కష్టకాలంలో క్రెడిట్ కార్డ్ ఒక గొప్ప ఆసరాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మీరు తెలివిగా ఉపయోగిస్తే ఇది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించడమే కాకుండా భవిష్యత్తులో బ్యాంకుల నుండి లోన్లు పొందడానికి కూడా సహాయపడుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ కేవలం జీతం వచ్చే వారికే ఇస్తారా? నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు లేదా ఫ్రీలాన్సర్లు దీనిని పొందలేరా? అంటే.. ఖచ్చితంగా పొందవచ్చు. ఆదాయ ధృవీకరణ పత్రం లేకుండా క్రెడిట్ కార్డ్ పొందే సులభమైన మార్గాలీవే.

ఆదాయ ధృవీకరణ లేకుండా క్రెడిట్ కార్డ్

సాధారణంగా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ఇచ్చేముందు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అడుగుతాయి. ఎందుకంటే మీరు వాడిన డబ్బును తిరిగి చెల్లించగలరా లేదా అని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. విద్యార్థులు లేదా ఫ్రీలాన్సర్లకు ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు.

Also Read: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు

సాధారణ ‘అన్‌సెక్యూర్డ్’ క్రెడిట్ కార్డ్‌లకు ఆదాయ రుజువు అవసరం. కానీ సంప్రదాయ ఆదాయ వనరులు లేని వారి కోసం ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇవి మీ క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవడానికి భవిష్యత్తులో మంచి కార్డ్‌లు పొందడానికి సహాయపడతాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా

ఆదాయ ధృవీకరణ లేనప్పుడు అత్యుత్తమ మార్గం ‘సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్’. మీరు బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా ఈ కార్డ్ ఇస్తారు. ఉదాహరణకు ICICI బ్యాంక్ వంటి సంస్థలు FDపై తక్షణమే క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. మీ అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల కార్డ్‌లను ఎంచుకోవచ్చు. ప్రతి కార్డ్‌కు కనీస FD మొత్తం ఉండాలి. సాధారణంగా మీ FD మొత్తంలో 90% వరకు క్రెడిట్ లిమిట్‌గా ఇస్తారు.

విద్యార్థుల కోసం ప్రత్యేక కార్డ్‌లు

విద్యార్థుల అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రెడిట్ కార్డ్‌లు మార్కెట్లో ఉన్నాయి. ఇవి సాధారణ కార్డ్‌ల కంటే భిన్నంగా పనిచేస్తాయి. వీటిని పొందడానికి విద్యార్థులు ఎటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.

బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహణ

మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా మంచి బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేస్తుంటే మీ లావాదేవీల హిస్టరీని బట్టి బ్యాంకులు స్వయంగా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Credit Card
  • Credit Card Rules
  • unemployed
  • Utility News

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd