Haldirams : స్నాక్స్ దిగ్గజం ‘హల్దీరామ్స్’ను ఎవరు కొనబోతున్నారో తెలుసా ?
‘హల్దీరామ్స్’ స్నాక్స్ వరల్డ్ ఫేమస్. వాటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. చాలా దేశాల్లో వీటి సేల్స్ జరుగుతుంటాయి.
- By Pasha Published Date - 09:29 AM, Tue - 9 July 24

Haldirams : ‘హల్దీరామ్స్’ స్నాక్స్ వరల్డ్ ఫేమస్. వాటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. చాలా దేశాల్లో వీటి సేల్స్ జరుగుతుంటాయి. అందుకే ఈ కంపెనీలో మెజారిటీ వాటా కొనేందుకు ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. హల్దీరామ్స్‌లో 76 శాతం వాటాను కొనేందుకు ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం ‘బ్లాక్‌స్టోన్’ సారథ్యంలోని కన్సార్షియం ప్రయత్నాలు చేస్తోంది. అయితే తమ కంపెనీకి చెందిన వాటాను 51 శాతానికి మించి విక్రయించే ఆలోచనేదీ లేదని హల్దీరామ్స్ ప్రమోటర్లలో కొందరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో హల్దీరామ్స్(Haldirams) ఒప్పందం కుదిరితే.. అది మనదేశంలోనే అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.70,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
బ్లాక్‌స్టోన్(Blackstone), హల్దీరామ్స్ కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు తుదిదశకు చేరాయని సమాచారం. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ గత కొద్ది నెలలుగా హల్దీరామ్స్ కంపెనీ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే బిజినెస్ విలువ విషయంలో ఇంకా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదరలేదు. 51 శాతం వరకు వాటాను విక్రయిస్తామని, అంతకంటే ఎక్కువ వాటాను ఇవ్వలేమని హల్దీరామ్స్ కంపెనీ ప్రమోటర్లు అంటున్నారు. ఒకవేళ తమ షరతులకు బ్లాక్‌స్టోన్ కంపెనీ అంగీకరించకుంటే.. ఇతర కంపెనీలతో చర్చలను ప్రారంభించాలని హల్దీరామ్స్ ప్రమోటర్లు భావిస్తున్నారు. అవసరమైతే స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని యోచిస్తున్నారు.
Also Read :Iran – Hezbollah : హిజ్బుల్లాకు మద్దతు.. లెబనాన్‌పై దాడి చేస్తే ఖబడ్దార్ : పెజెష్కియాన్
హల్దీరామ్స్ ప్రమోటర్లు ఢిల్లీ, నాగ్‌పూర్‌లలోని తమ బ్రాంచీల ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ కంపెనీలను విలీనం చేసి హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా మార్చాలని అనుకుంటున్నారు. ఇలా ఏర్పాటయ్యే కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి.