Credit Card New Rules: ఈనెల నుంచి ఈ క్రెడిట్ కార్డుల నిబంధనలు మార్పు..!
- By Gopichand Published Date - 03:30 PM, Sat - 1 June 24

Credit Card New Rules: మీరు క్రెడిట్ కార్డ్ వినియోగదారు అయితే ఈ న్యూస్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన అనేక నియమాలు (Credit Card New Rules) ఈ నెలలో అంటే జూన్‌లో మారుతున్నాయి. అయితే ఈ నిబంధనలను కొన్ని కంపెనీలు మాత్రమే మారుస్తున్నాయి. అంటే ఆ కంపెనీ కార్డును కలిగి ఉన్న వినియోగదారులపై మాత్రమే ఇది ప్రభావం చూపుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, బిఒబి (బ్యాంక్ ఆఫ్ బరోడా), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొదలైనవి తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతున్నాయి బ్యాంకులు. ఈ నియమాలు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ మొదలైన వాటికి సంబంధించినవని సమాచారం.
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్
మీరు ICICI బ్యాంక్ Amazon Pay క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ఇప్పుడు మీరు జూన్ 18 నుండి అద్దె చెల్లింపుపై ఎలాంటి రివార్డ్ పాయింట్‌లను పొందలేరు. ఇంతకు ముందు ఛార్జీ చెల్లింపు ధరలో ఒక శాతానికి సమానమైన రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండేవి. కొత్త నియమం ప్రకారం.. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇంధన సర్‌ఛార్జ్ చెల్లింపుపై ఒక శాతం తగ్గింపును పొందగలరు.
SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్
SBI క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు జరిగినప్పుడు దానిపై రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. జూన్ 1 నుండి ఇటువంటి ప్రభుత్వ లావాదేవీలపై ఎటువంటి రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. ఈ సదుపాయం నిలిపివేయబడే SBI క్రెడిట్ కార్డ్‌లలో SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ మొదలైనవి ఉన్నాయి.
Also Read: Neha Sharma : ఐస్ బాత్ చేస్తున్న హీరోయిన్ నేహా శర్మ.. వీడియో వైరల్..
BoB క్రెడిట్ కార్డ్
ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్న వారు ఇప్పుడు ఆలస్య చెల్లింపు కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నియమాలు జూన్ 23 నుండి అమలులోకి వస్తాయి.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్
స్విగ్గీ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన నియమాలు కూడా జూన్ నుండి మారబోతున్నాయి. మీరు HDFC బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే మీరు దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం. కొత్త రూల్ ప్రకారం.. Swiggy యాప్‌లోని Swiggy Moneyలో డబ్బును డిపాజిట్ చేస్తే వచ్చే క్యాష్‌బ్యాక్ వచ్చే నెల కార్డ్ స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌లో సర్దుబాటు చేయబడుతుంది. ఈ నిబంధన జూన్ 21 నుంచి అమల్లోకి రానుంది.
We’re now on WhatsApp : Click to Join
ఈ బ్యాంకుల కార్డు నియమాలలో కూడా మార్పులు ఉంటాయి
- యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ లావాదేవీలపై అదనపు ఛార్జీలను మార్చబోతోంది.
- మీరు IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉండి దాని ద్వారా రూ. 20,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లించినట్లయితే మీరు ఒక శాతం రుసుము, GST చెల్లించాలి.