Neha Sharma : ఐస్ బాత్ చేస్తున్న హీరోయిన్ నేహా శర్మ.. వీడియో వైరల్..
ఐస్ బాత్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన హీరోయిన్ నేహా శర్మ. ఆ వీడియోలో అమ్మడి అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
- By News Desk Published Date - 11:48 AM, Sat - 1 June 24

Neha Sharma : బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ సోషల్ మీడియాలో హాట్ షోతో సందడి చేస్తుంటారు. తన సిస్టర్ అయిషా శర్మతో కలిసి హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షాట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. అమ్మడి పోస్టుల కోసం నెటిజెన్స్ కూడా క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా ఈ భామ ఐస్ బాత్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్విమ్మింగ్ డ్రెస్ తో బాత్ టబ్ లో కోల్డ్ వాటర్ లో థెరపీని తీసుకుంటున్న వీడియోని నేహా శర్మ తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. దాదాపు మూడు నిమిషాలు పైనే నేహా శర్మ కోల్డ్ బాత్ చేసారు. ఆ వీడియోలో అమ్మడి అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
కాగా నేహా శర్మ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. తెలుగు మూడు సినిమాలు మాత్రమే చేసారు. ఇక్కడి మేకర్స్ ఈ ముద్దుగుమ్మని పెద్దగా పట్టించుకోకపోవడంతో.. బాలీవుడ్ చెక్కేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు అందలేదు.
దీంతో సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ.. యూత్‌ని, మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ హాట్ షోతో ఈ అమ్మడికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని.. పలు వెబ్ సిరీస్ లో అవకాశాలు వస్తున్నాయి.