డిసెంబర్ 31లోపు మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే!
మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 ఆఖరి అవకాశం.
- Author : Gopichand
Date : 29-12-2025 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
Important Tasks: డిసెంబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుంది. దానితో పాటు కొత్త ఏడాది ప్రారంభం కాబోతోంది. అయితే కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోయే ముందు మీరు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31 అని గుర్తుంచుకోండి.
డిసెంబర్ 31లోపు మీరు పూర్తి చేయాల్సిన ఆ 3 పనులు ఇవే
వార్షిక GST రిటర్న్ దాఖలు
వార్షిక GST రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. మీకు ఏదైనా వ్యాపారం ఉన్నా లేదా GST-నమోదిత సంస్థ ఉన్నా, ఈ పనిని వెంటనే పూర్తి చేయండి.
Also Read: టీమిండియా టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ ఇతనే!
ఏమి చేయాలి?
ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం అమ్మకాలు, క్లెయిమ్ చేసిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, చెల్లించిన పన్ను, పొందిన రీఫండ్‌ల వివరాలను ఇందులో తెలపాలి. గడువు దాటితే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టాక్స్ అధికారుల నుండి నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఆధార్-పాన్ లింకింగ్
మీరు అక్టోబర్ 1, 2024న లేదా అంతకంటే ముందు మీ ఆధార్ కార్డును పొంది ఉంటే డిసెంబర్ 31లోపు దానిని మీ పాన్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. పాన్ కార్డు ‘ఇన్-యాక్టివ్’ అవుతుంది. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ తెరవడం, డెబిట్/క్రెడిట్ కార్డుల జారీ, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, భారీ నగదు డిపాజిట్ల వంటి లావాదేవీలకు ఆటంకం కలుగుతుంది. ఆదాయపు పన్ను రీఫండ్‌లు పొందలేరు. ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్
మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 ఆఖరి అవకాశం. ఈ తేదీ తర్వాత రివైజ్డ్ ఫైలింగ్‌కు అనుమతి ఉండదు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పన్ను శాఖ అనుమతితో మాత్రమే అప్‌డేటెడ్ రిటర్న్ సమర్పించే అవకాశం ఉంటుంది.