HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Cognizant Vs Infosys Cognizant Says Infosys Got Caught Red Handed Stealing Trade Secrets

Cognizant VS Infosys : ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ

కాగ్నిజెంట్‌ కంపెనీ చేసిన ఆరోపణలను ఇన్ఫోసిస్‌(Cognizant VS Infosys) ఖండించింది.

  • By Pasha Published Date - 05:22 PM, Tue - 18 February 25
  • daily-hunt
Cognizant Vs Infosys Trade Secrets Theft

Cognizant VS Infosys : ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌.. ఐటీ దిగ్గజ కంపెనీలు. ఓ విషయంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు తలపడుతున్నాయి. ఒకదానిపై మరొకటి న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇంతకీ ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన

ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలు..

తమ హెల్త్‌ కేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రెజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని కాగ్నిజెంట్‌ ఆరోపిస్తోంది. ‘‘నాన్‌ డిస్‌క్లోజర్‌ అండ్‌ యాక్సెస్‌ అగ్రిమెంట్‌ (NDAAs) ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను  దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. అయితే దీనిపై ఆడిట్‌ చేసేందుకు ఇన్ఫోసిస్ నిరాకరించింది’’ అని కాగ్నిజెంట్‌ పేర్కొంది. ఈమేరకు ఇన్ఫోసిస్‌పై అభియోగాలతో 2024 ఆగస్టులో అమెరికాలోని ఓ కోర్టులో కాగ్నిజెంట్‌  కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.

Also Read :Gold Rush : ట్రంప్ ఎఫెక్ట్.. విమానాల్లో బంగారాన్ని తెప్పిస్తున్న బ్యాంకులు

రవికుమార్ ఎవరు ? ఏం చేశారు ?

కాగ్నిజెంట్‌ కంపెనీ చేసిన ఆరోపణలను ఇన్ఫోసిస్‌(Cognizant VS Infosys) ఖండించింది. కాగ్నిజెంట్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ బహిరంగంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ఉన్న రవికుమార్‌ తమ కంపెనీ(ఇన్ఫోసిస్)లో పనిచేసిన టైంలో హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్‌ ప్రత్యారోపణలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం, రవి కుమార్ చర్చలు జరిపారని తెలిపింది. రవికుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను విడిచిపెట్టారు. ఆ మరుసటి ఏడాది(2023) జనవరిలోనే కాగ్నిజెంట్‌లో సీఈఓ హోదాలో చేరారు. ఈ రెండు ఐటీ కంపెనీలు అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ సేవల విభాగంలో పరస్పరం పోటీపడుతున్నాయి. ఇన్ఫోసిస్‌ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్‌ సైన్సెస్‌ విభాగం నుంచే వస్తోంది. మొత్తం మీద ఆసక్తికర రీతిలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్ మధ్య న్యాయపోరు నడుస్తోంది. ఐటీ పరిశ్రమలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read :Vice Chancellors : ఏపీలోని వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం..నోటిఫికేషన్‌ విడుదల


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cognizant
  • Cognizant VS Infosys
  • infosys
  • Trade Secrets Theft

Related News

It Employee

IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గ

  • Infosys

    Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

Latest News

  • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

  • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

Trending News

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd