Air India: మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..!
ఎయిర్‌లైన్ తరపున తెలిపిన వివరాల ప్రకారం.. అందరు ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. “ఈ అనూహ్య ఆటంకం వల్ల మా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 09:35 PM, Sun - 22 June 25

Air India: ఎయిర్ ఇండియా (Air India) విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో కలకలం రేగింది. బర్మింగ్‌హామ్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ AI-114కు బాంబు బెదిరింపు రావడంతో.. దానిని సౌదీ అరేబియాలోని రియాద్ వైపు మళ్లించారు. ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. “జూన్ 21న బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ నంబర్ AI-114కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో దానిని రియాద్ వైపు మళ్లించారు.” రియాద్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, భద్రతా తనిఖీలు పూర్తయ్యాయని వారు తెలిపారు.
ఎయిర్‌లైన్ తరపున తెలిపిన వివరాల ప్రకారం.. అందరు ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. “ఈ అనూహ్య ఆటంకం వల్ల మా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
Also Read: Health : హాట్ చిప్స్ అధికంగా తింటున్నారా? మీ గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే!
ఇండిగో ఫ్లైట్‌లో సమస్య
ఇదే సమయంలో శుక్రవారం ఇండిగో ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేశారు. ANI సోర్సెస్ ప్రకారం.. విమాన సమస్యను ముందుగానే గుర్తించారని, భద్రతా జాగ్రత్తగా అందరు ప్రయాణికులను సురక్షితంగా దించారని తెలిపారు.
చెన్నై వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్
అలాగే, గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌ను చెన్నైలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. కెప్టెన్ తక్కువ ఇంధనం కారణంగా ‘మేడే’ కాల్ జారీ చేశారు. విమానం చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ల్యాండింగ్ కాలేదు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కలకలం
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన తర్వాత నిరంతరం భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. విమానాల నిర్వహణ, మెయింటెనెన్స్‌పై తీవ్రంగా శ్రద్ధ చూపిస్తున్నారు. అహ్మదాబాద్‌లో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.