Xiaomi Mini Electric Car : రూ. 3.47 లక్షలకే షావొమి మినీ ఎలక్ట్రిక్ కారు
ఈ షావొమా మినీ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది.
- By Maheswara Rao Nadella Published Date - 02:40 PM, Sat - 30 September 23

Xiaomi Mini Electric Car : సింగిల్ చార్జింగ్ తో 1200 కిలోమీటర్లు ప్రయాణించే మినీ ఎలక్ట్రిక్ కారును చైనాకు చెందిన ఫస్ట్ ఆటో వర్క్స్ (First Auto Works) అనే సంస్థ రూపొందించింది. చైనాలో ఈ మినీ ఎలక్ట్రిక్ కారు వూలింగ్ హ్వాంగ్వాంగ్ (Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారుతో పోటీ పడుతుంది. ఈ షావొమా మినీ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది. ఈ కారు ప్రి సేల్స్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.
Xiaomi Mini Electric Car రూ. 3.47 లక్షలు మాత్రమే..!
ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. త్వరలో గ్లోబల్ లాంచ్ ఉండబోతోంది. ఈ కారును ఈ ఏప్రిల్ నెలలో జరిగిన షాంఘై ఆటో షోలో తొలిసారి చూపించారు. ఈ ఫస్ట్ ఆటో వర్క్స్ రూపొందించిన బెస్ట్యూన్ కారు ధర చైనా కరెన్సీలో 30వేల నుంచి 50వేల యువాన్ల మధ్య ఉంది. అంటే భారతీయ కరెన్సీలో రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు హార్డ్ టాప్, కన్వర్టబుల్ వేరియంట్లలో లభిస్తుంది. కాకపోతే కన్వర్టబుల్ వేరియంట్ ను ఇంకా లాంచ్ చేయలేదు. ఈ కారు సింగిల్ చార్జింగ్ తో 1200 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ చెబుతుంది.
వూలింగ్ హ్వాంగ్వాంగ్ తో పోటీ..
ఇప్పుడు చిన్న ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో ఆ కారుకు ఇప్పుడు చైనాలో పోటీ లేదు. ప్రస్తుతం చైనాలో వూలింగ్ హాంగ్వాంగ్ (Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లీడర్ గా ఉంది. షావోమా బెస్ట్యూన్ కారు దానికి పోటీ ఇవ్వనుంది. ఇది బాక్సి టైప్ డిజైన్ తో వస్తుంది. షావొమా బెస్ట్యూన్ ఎలక్ట్రిక్ కార్లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్యుయల్ టోన్ థీమ్ డాష్ బోర్డు, స్క్వేర్ హెడ్ లైన్స్, రౌండెడ్ కార్నర్స్, ఎయిరో డైనమిక్ వీల్స్, ప్రత్యేక టెయిల్ ల్యాంప్స్, బంపర్స్ తో కారు వెనకవైపు డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ తో 1200 కిమీలు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ కారు డైమెన్షన్స్ 300mm పొడవు, 1510mm వెడల్పు, 1630mm ఎత్తు, 1953mm వీల్ బేస్ ఉన్నాయి.
Also Read: Toyota Land Cruiser Mini : టయోటా నుంచి సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ మినీ రాబోతుంది…