DION Electric Vehicles: మార్కెట్ లోకి విడుదలైన మరో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్.. ఫీచర్స్ మామలుగా లేవుగా!
తాజాగా మార్కెట్లోకి మరో రెండు ఎలక్ట్రిక్ ఈ స్కూటర్లు విడుదల అయ్యాయి.
- By Anshu Published Date - 10:00 AM, Wed - 28 August 24

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే ఆయా సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే భారత మార్కెట్ లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. వాటికి తోడు తాజాగా డియాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ రెండు ఇ స్కూటర్లకు ప్రారంభించింది. చెన్నైలో కొత్తగా షోరూమ్ ను కూడా మొదలు పెట్టింది. మరి ఈ డియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రత్యేకతలు, ధర వివరాల విషయానికి వస్తే..
పవర్ ట్రాన్స్ మొబిలిటీ లిమిటెడ్ యాజ మాన్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ మొబిలిటీ బ్రాండ్ డియాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ సంస్థ ఇటీవలే రెండు కొత్త ప్రత్యేకమైన ఇ స్కూటర్ మోడళ్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. వాటికి ఆగస్టా ఎస్పీ, ఆస్టా ఎఫ్ హెచ్ అని నామకరణం కూడా చేసింది. చెన్నైలోని రామాపురంలో కంపెనీ తన కొత్త షోరూమ్ ను ప్రారంభించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఏడు ఈవీ మోడళ్లు ఉన్నాయి. అలాగే మూడు షోరూమ్ లు, ఐదు సర్వీస్ సెంటర్ల కూడా ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్ ప్రొవైడర్ తో భాగస్వామ్యంతో వినియోగదారులు తమిళనాడు అంతటా 256 స్టేషన్లలో వాహన సేవలను పొందవచ్చు. కాగా ఈ అగస్టా ఎస్పీ ఇ స్కూటర్ లోని 7.5 కేడబ్ల్యూ పీక్ పీఎంఎస్ఎం హబ్ మోటార్ తో పనితీరును చాలా సమర్థంగా ఉంటుంది.
ఈ బండి గరిష్టంగా 120 కేఎంపీహెచ్ వేగంతో పరుగులు తీస్తుంది. వెనుక స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రత్యేకంగా అమర్చారు. అలాగే ఆస్టా ఎఫ్ హెచ్ వెనుక మోనో స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సెటప్‌తో కూడిన అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల భద్రత, సౌకర్యం మరింత పెరుగుతుంది. రెండు మోడళ్లలో యాంటీ థెఫ్ట్ లాక్‌లు, ఫ్రంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీలు, వెనుక వైపు సాధారణ ఎల్ఈడీలు ఉన్నాయి. రెండింటినీ కేవలం 4 నుంచి 5 గంటల్లో 1 కేవీఏ ఛార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కొత్త టెక్నాలజీ ని కోరుకునే వారికి కచ్చితంగా సరిపోతాయి. ఇకపోతే ఈ స్కూటర్ ల ధరల విషయానికి వస్తే.. ఆగస్టా ఎస్పీ రూ.1,79,750 కాగా ఆస్టా ఎఫ్ హెచ్ రూ1,29,999 గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్ గా ఈ స్కూటర్ లపై రూ.22 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ వరకూ మాత్రమే ఈ అవకాశం ఉంది.