Toyota Urban Cruiser: టయోటా నుంచి మరో కారు.. ధర, డౌన్ పేమెంట్, ఫీచర్ల వివరాలివే!
ఒకవేళ మీరు బేస్ వేరియంట్ (E NeoDrive మైల్డ్ హైబ్రిడ్) ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే కనీసం 2 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన 11.28 లక్షల లోన్‌ను 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల వ్యవధికి తీసుకుంటే మీ నెలవారీ EMI సుమారు 23,000 రూపాయలు అవుతుంది.
- By Gopichand Published Date - 05:36 PM, Fri - 11 July 25

Toyota Urban Cruiser: టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser) ఒక సరసమైన, నమ్మదగిన హైబ్రిడ్ SUV. ఈ వాహనం దాని ఇంధన సామర్థ్యం, ఆకర్షణీయమైన రూపం కారణంగా చాలా జనాదరణ పొందింది. ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని ధర, డౌన్ పేమెంట్, ఫీచర్ల గురించి తెలుసుకోవడం ముఖ్యం. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర 11.34 లక్షల నుండి ప్రారంభమై 19.99 లక్షల వరకు ఉంటుంది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ (S Hybrid) 16.81 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభ్యమవుతుంది.
టొయోటా హైరైడర్ ఆన్-రోడ్ ధర ఎంత?
- ఢిల్లీలో E NeoDrive మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు 13.28 లక్షలు.
- S హైబ్రిడ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు 19.60 లక్షలు. ఇందులో RTO ట్యాక్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఛార్జీలు ఉన్నాయి.
- ఒకవేళ మీరు బేస్ వేరియంట్ (E NeoDrive మైల్డ్ హైబ్రిడ్) ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే కనీసం 2 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన 11.28 లక్షల లోన్‌ను 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల వ్యవధికి తీసుకుంటే మీ నెలవారీ EMI సుమారు 23,000 రూపాయలు అవుతుంది.
హైబ్రిడ్ వేరియంట్‌పై డౌన్ పేమెంట్ ఎంత?
- ఒకవేళ మీరు హైబ్రిడ్ వేరియంట్ (S హైబ్రిడ్) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే కనీసం 5 లక్షల డౌన్ పేమెంట్ కట్టాలి. రూ. 14.60 లక్షల లోన్ తీసుకోవాలి.
- 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల వ్యవధికి EMI నెలకు సుమారు 30,000 రూపాయలు ఉంటుంది.
Also Read: Babydoll Archi AKA Archita : వైరల్ గా మారిన అర్చితా ఫుకాన్ ‘రెడ్ లైట్ ‘ కథ
హైరైడర్ SUV ఫీచర్లు
టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
- వీటిలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- హెడ్-అప్ డిస్‌ప్లే (HUD)
- పనోరమిక్ సన్‌రూఫ్
- వైర్‌లెస్ ఛార్జింగ్
- 6-స్పీకర్ ఆడియో సిస్టమ్
సేఫ్టీ ఫీచర్లు
- 6 ఎయిర్‌బ్యాగ్‌లు
- 360-డిగ్రీ కెమెరా
ఇంజన్- మైలేజ్
ఈ SUVలో మూడు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి.
- 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్
- 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్)
- 1.5-లీటర్ CNG ఇంజన్
ట్రాన్స్‌మిషన్ ఎంపికలు
- 5-స్పీడ్ మాన్యువల్
- 6-స్పీడ్ ఆటోమేటిక్
- e-CVT
కంపెనీ ప్రకారం.. పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ 1 లీటర్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే CNG వేరియంట్ 1 కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.