Tesla Recalls: 30,000 టెస్లా కార్ల రీకాల్.. కారణమిదే..?
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ.. 30,000 మోడల్ X కార్లను రీకాల్ చేసింది.
- By Gopichand Published Date - 05:41 PM, Sat - 19 November 22

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ.. 30,000 మోడల్ X కార్లను రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని, దీని వల్ల ముందు కూర్చునే ప్రయాణికులకు ప్రమాద సమయాల్లో గాయాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్లను రీకాల్ చేసింది. కాగా.. ఈ నెల ప్రారంభంలో స్టీరింగ్ సమస్య కారణంగా 40వేల మోడల్ S, మోడల్ X కార్లను రీకాల్ చేసింది. షేర్లు దాదాపు 3% క్షీణించి రెండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.
ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన Model X కార్లలో ఎయిర్‌బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య వల్ల కారు ముందు కూర్చునే ప్యాసింజర్లకు ప్రమాద సమయల్లో గాయాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మోడల్‌లోని 30 వేల కార్లను రీకాల్ చేసింది. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ సమస్య పరిష్కరించబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమేకర్ 40,000 మోడల్ S, మోడల్ X వాహనాలను రీకాల్ చేసింది. కార్లలో పవర్ స్టీరింగ్ సమస్య ఏర్పడుతోందని 40,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టెస్లా షేర్లు దాదాపు 3% క్షీణించి రెండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.
Related News

Cybertruck: లాంచ్ కాక ముందే బుకింగ్స్ తో అదరగొడుతున్న కారు.. లక్ష్మల్లో బుకింగ్స్?
వాహనదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీలలో టెస్లా కంపెనీ కూడా ఒకటి. ముఖ్యంగా టెస్లా కంపెనీకి చెందిన కార్ లను వాహన వినియోగదారులు ఎక్కువగ