Discount On Cars: హోండా కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు.. ఎంతంటే..?
హోండా ఎలివేట్‌పై రూ.65 వేల వరకు బెనిఫిట్‌లను అందజేస్తున్నారు. హోండా ఈ SUVని ఏప్రిల్‌లో అప్‌డేట్ చేసింది. ఈ కారుకు అధునాతన సేఫ్టీ టెక్నాలజీని జోడించారు.
- Author : Gopichand
Date : 04-08-2024 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
Discount On Cars: హోండా తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్ల (Discount On Cars)ను కొనసాగిస్తోంది. ఈ కార్లపై జూలై 2024కి సంబంధించిన ఆఫర్ కూడా ఆగస్టులో ఇవ్వనున్నారు. హోండా సిటీ హైబ్రిడ్‌పై అత్యధిక తగ్గింపు ఇవ్వనున్నారు. ఇది కాకుండా ఎలివేట్ SUV, కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌పై కూడా డిస్కౌంట్ ఆఫర్ కొనసాగుతోంది. హోండా నుండి ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.
హోండా ఎలివేట్‌పై తగ్గింపు
హోండా ఎలివేట్‌పై రూ.65 వేల వరకు బెనిఫిట్‌లను అందజేస్తున్నారు. హోండా ఈ SUVని ఏప్రిల్‌లో అప్‌డేట్ చేసింది. ఈ కారుకు అధునాతన సేఫ్టీ టెక్నాలజీని జోడించారు. ఈ కారుపై ప్రయోజనాలు కేవలం ఆ మోడల్‌లపై మాత్రమే అందించబడుతున్నాయి. కారులో అప్‌డేట్ చేయడానికి ముందు దీని తయారీ జరిగింది. హోండా ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.91 లక్షల నుండి మొదలై రూ. 16.51 లక్షల వరకు ఉంటుంది.
Also Read: Paris Olympics, Medal Tally: పారిస్ ఒలింపిక్స్ అగ్రస్థానంలో చైనా, 54 వ స్థానంలో భారత్
హోండా సిటీ హైబ్రిడ్‌పై తగ్గింపు ఆఫర్
హోండా సిటీ హైబ్రిడ్ పై రూ.78 వేలు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనితో పాటు ఈ కారుపై కాంప్లిమెంటరీ 20 వేల రూపాయల 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ కూడా ఇవ్వబడుతుంది. ఈ హోండా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 19 లక్షల నుండి మొదలై రూ. 20.55 లక్షల వరకు ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
హోండా అమేజ్‌పై తగ్గింపు ఆఫర్
హోండా అమేజ్ విఎక్స్, ఎలైట్ వేరియంట్‌లపై రూ.96 వేల విలువైన ప్రయోజనాలు అందించబడుతున్నాయి. దీని ఎస్ వేరియంట్‌పై రూ.76 వేలు, ఇ వేరియంట్‌పై రూ.66 వేల వరకు ప్రయోజనాలు అందజేస్తున్నారు. హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7,92,800 నుండి ప్రారంభమవుతుంది.
హోండా సిటీపై డిస్కౌంట్ ఆఫర్
హోండా సిటీపై రూ.88 వేల విలువైన బెనిఫిట్లను అందజేస్తున్నారు. దీని నవీకరించబడిన మోడల్ కూడా రూ. 68 వేల విలువైన ప్రయోజనాలతో వచ్చింది. హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.82 లక్షల నుంచి మొదలై రూ. 16.35 లక్షల వరకు ఉంది.