Royal Enfield Classic 650: మార్కెట్ లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త బైక్.. ధర ఫీచర్స్ ఇవే?
ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడ
- By Anshu Published Date - 04:15 PM, Fri - 23 June 23

ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్ లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కీ భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. మరికొన్ని బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల భావిస్తోంది సదరు సంస్థ. రానున్న సంవత్సరాల్లో పలు రకాల బైక్స్ ని విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగానే 350 సీసీ నుంచి 650సీసీ పలు కొత్త మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఆరు రకాల బైక్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో షాట్ గన్ 650, హిమాలయన్ 650, బుల్లెట్ 650, క్లాసిక్ 650, స్క్రాంబ్లర్ 650, రెట్రో సైలీ కాంటినెంటల్ జిటి 650 రేసింగ్ బైక్ లు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 స్పైడ్ టెస్టింగ్ చేయబడింది. ఈ టెస్టింగ్ సమయంలో వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బ్లాక్ కలర్లో కెమెరాకు చిక్కింది. ఈ బైక్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్ వెనకాల డ్యూయల్ షాక్ అబ్జర్బర్ కలిగి ఉండనుంది.
ఈ బైకుకు రెట్రో శైలి వృత్తాకార ఎల్ఈడి హెడ్ లైట్, సైడ్ ఇండికేటర్స్ ఉండనున్నాయి. స్పోక్డ్ వీల్స్ పొడవైన మడ్ గార్డులు, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్, సెంటర్ సెట్, ఫుట్ పెగ్గులతో ఈ బైక్ వస్తుంది. ఇకపోతే ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే… కలర్ టిఎఫ్టి డిస్ప్లే, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిప్పర్ నావిగేషన్ డిస్ప్లే, రెండు ట్రిప్ మీటర్లతో రానుంది. క్లాసిక్ 350 స్విచ్ గేర్ తో రావచ్చు అని అంచనా. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ.3 లక్షలు ఇక్ష షో రూమ్ గా ఉండవచ్చని అంచనా. ఈ బైక్ 2025లో విడుదల కానుంది అని అంచనా.