Ola Electric : ఓలా తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విడుదల.. ధరలు, వేరియంట్ల వివరాలివీ
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ‘రోడ్‌స్టర్’ మోటార్ సైకిల్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది.
- By Pasha Published Date - 05:07 PM, Thu - 15 August 24

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ‘రోడ్‌స్టర్’ మోటార్ సైకిల్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. ఈ కంపెనీ నుంచి రిలీజైన తొలి మోటార్ సైకిల్ ఇదే. రోడ్ స్టర్‌కు చెందిన మూడు వేరియంట్లను ఓలా(Ola Electric) విడుదల చేసింది. వాటి పేర్లు.. రోడ్ స్టర్ (Roadster), రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X), రోడ్ స్టర్ ప్రో (Roadster Pro). వీటిలో కొన్ని సబ్ వేరియంట్లను కూడా ఓలా ఎలక్ట్రిక్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇవాళ ‘సంకల్ప్’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో ఈ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. రోడ్ స్టర్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ.74,999.
We’re now on WhatsApp. Click to Join
రోడ్ స్టర్ ఎక్స్
- ‘రోడ్ స్టర్ ఎక్స్’ మోటార్ సైకిల్ వేరియంట్ ధర రూ.74,999.
- ఇందులో మూడు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి.
- దీనిలో 2.5kWh బ్యాటరీ ఉంది.
- దీనిలో 3.5kWh వేరియంట్ ధర రూ.85,999.
- దీనిలో 4.5kWh వేరియంట్ ధర రూ.99,999.
- ఈ మోటార్ సైకిల్ సింగిల్ ఛార్జ్‌తో గరిష్ఠంగా 200 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు.
- దీని టాప్ స్పీడ్ గంటకు 124 కిలోమీటర్లు.
- 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఈ మోటార్ సైకిల్ వస్తుంది.
- దీన్ని ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
- వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.
Also Read :19 Bombs Planted : 19 చోట్ల బాంబులు.. ఆ రాష్ట్రంలో కలకలం.. ఏమైందంటే ?
రోడ్ స్టర్
- రోడ్‌స్టర్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ.1.04 లక్షలు. దీని బ్యాటరీ కెపాసిటీ 3.5 kWh.
- రోడ్‌స్టర్ మోటార్ సైకిల్‌లో 4.5kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర రూ.1,19,999.
- ఇందులోనే 6kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర రూ.1,39,999.
- ఈ మోటార్ సైకిల్ డెలివరీలు కూడా జనవరి నుంచే మొదలవుతాయి.
- ఈ మోటార్ సైకిల్ టాప్ స్పీడ్ గంటకు 126 కిలోమీటర్లు.
- 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 151 కి.మీ, 4.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 190 కిలోమీటర్లు, 6kWh బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 248 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించొచ్చు.
- ఈ మోటార్ సైకిళ్లలో 6.8 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లేను అందిస్తున్నారు.
రోడ్ స్టర్ ప్రో
- రోడ్‌స్టర్ సిరీస్‌లో 9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే మోటార్ సైకిల్ ధర రూ.1.99 లక్షలు.
- దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 194 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు.
- ఈ మోటార్ సైకిల్‌లోనే 16kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 579 కిలోమీటర్ల ప్రయాణించొచ్చు. దీని ధర రూ.2.49 లక్షలు.
- ఈ బైక్ డెలివరీలు 2025 దీపావళి నుంచి మొదలవుతాయి.
- దీనిలో 10 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే ఉంటుంది.