రూ. 21,000 చెల్లించి ఈ కారును సొంతం చేసుకోండి!
Renault Duster ప్రీ-బుకింగ్స్ జనవరి 26, 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఎవరైతే ఈ కారును ముందే బుక్ చేసుకుంటారో వారికి తక్కువ ధరతో పాటు త్వరగా డెలివరీ పొందే అవకాశం లభిస్తుంది.
- Author : Gopichand
Date : 27-01-2026 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
New Renault Duster: భారతీయ కార్ మార్కెట్లో దాదాపు దశాబ్దం తర్వాత Renault Duster 2026 సరికొత్త అవతారంలో తిరిగి వచ్చింది. 4.2 నుండి 4.4 మీటర్ల SUV సెగ్మెంట్లో ఇప్పటికే అనేక కార్లు పోటీలో ఉన్నప్పటికీ రేనో సంస్థ మళ్ళీ ఈ విభాగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు బుకింగ్, ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Renault Duster ప్రీ-బుకింగ్స్ జనవరి 26, 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఎవరైతే ఈ కారును ముందే బుక్ చేసుకుంటారో వారికి తక్కువ ధరతో పాటు త్వరగా డెలివరీ పొందే అవకాశం లభిస్తుంది. కంపెనీ సమాచారం ప్రకారం.. నాన్-హైబ్రిడ్ వేరియంట్ల డెలివరీ మార్చి 2026 నుండి ప్రారంభమవుతుంది. ఇక హైబ్రిడ్ వేరియంట్ల డెలివరీ దీపావళి 2026 సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీరు కేవలం రూ. 21,000 చెల్లించి ఈ కారును ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
Renault Duster పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది?
కొత్త డస్టర్‌లో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Turbo TCe 160 పెట్రోల్ ఇంజన్: ఇది 163 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఉంటుంది.
1.8 లీటర్ E-Tech 160 స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్: ఇందులో 1.4 kWh బ్యాటరీ, 8-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. నగరాల్లో 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడపవచ్చని కంపెనీ పేర్కొంది.
TCe 100 పెట్రోల్ ఇంజన్: ఇది 100 PS పవర్‌ను అందిస్తుంది. ఈ SUV గ్రౌండ్ క్లియరెన్స్ 212 మి.మీ గా ఉంది.
Also Read: రిటైర్మెంట్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ సింగర్!
డిజైన్- ఫీచర్లు
డిజైన్ విషయానికి వస్తే కొత్త డస్టర్ తన పాత ‘బాక్సీ’ స్టైల్‌ను కొనసాగిస్తూనే ఆధునిక హంగులను అద్దుకుంది. ఇందులో కొత్త హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, ధృడమైన బంపర్లు ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఈ కారుపై 7 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.
కారు లోపలి భాగం చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీని డాష్‌బోర్డ్ కూడా బయటి బాక్సీ డిజైన్‌కు తగ్గట్టుగా రూపొందించబడింది. ఇందులో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.