Electric Car BE 6E Name: కారు పేరు మార్చిన మహీంద్రా.. కారణమిదే?
మహీంద్రా ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని ఇండిగో ఆరోపించింది. 6E అనేది ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కోడ్, కాబట్టి మహీంద్రా దానిని తన ఎలక్ట్రిక్ కారు పేరుతో ఉపయోగించడం గందరగోళానికి దారితీస్తుందని కంపెనీ వాదించింది.
- Author : Gopichand
Date : 07-12-2024 - 9:12 IST
Published By : Hashtagu Telugu Desk
Electric Car BE 6E Name: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUVలు BE 6e, XEV 9eలను 26 నవంబర్ 2024న విడుదల చేసింది. దీని తర్వాత కంపెనీ BE 6E పేరుతో (Electric Car BE 6E Name) రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కారు పేరుపై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేయడంతో మహీంద్రా కొత్త వాహనం బీఈ 6ఈ వివాదంలోకి వచ్చింది. దీని తర్వాత తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనం పేరును BE6 గా మార్చాలని నిర్ణయించినట్లు కంపెనీ శనివారం తెలిపింది. దీనితో పాటు ట్రేడ్‌మార్క్ BE 6E కోసం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో కోర్టులో తీవ్రంగా పోరాడుతూనే ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇండిగో క్లెయిమ్ నిరాధారమైనదని మేము విశ్వసిస్తున్నామని, దానిని సవాలు చేయకపోతే, అది అక్షరం, లెక్కింపు మార్కులపై గుత్తాధిపత్యానికి తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని మహీంద్రా పేర్కొంది. అయితే మన సంకేతం ప్రత్యేకమైనది. విభిన్నమైనది. ఇది అన్ని పరిశ్రమలకు విఘాతం కలిగిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇండిగో ఆరోఫణలు ఇవే
మహీంద్రా ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని ఇండిగో ఆరోపించింది. 6E అనేది ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కోడ్, కాబట్టి మహీంద్రా దానిని తన ఎలక్ట్రిక్ కారు పేరుతో ఉపయోగించడం గందరగోళానికి దారితీస్తుందని కంపెనీ వాదించింది. 6E మార్క్ చాలా సంవత్సరాలుగా ఇండిగోకు గుర్తింపుగా ఉందని, ఇది రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ అని కంపెనీ తెలిపింది. ఇటువంటి పరిస్థితిలో కంపెనీ తన బ్రాండ్ గుర్తింపును కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఇండిగో వాదనతో మహీంద్రా ఏకీభవించడం లేదు
మరోవైపు ఇండిగో వాదనతో మహీంద్రా ఏకీభవించడం లేదు. తమ ట్రేడ్‌మార్క్ BE 6E అని, 6E కాదని కంపెనీ తెలిపింది. కాబట్టి దీనిని ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అని పిలవలేము. ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి గందరగోళం లేదు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ అంశంపై డిసెంబర్ 9న కోర్టులో విచారణ జరగనుంది. ఇంతలో ఈ రోజు మహీంద్రా ఒక పెద్ద అడుగు వేసి తన కారు పేరును మార్చింది.