Jawa 42: బైక్ ప్రియులకు శుభవార్త.. భారత మార్కెట్‌లోకి జావా 42, ధర ఎంతంటే..?
2024 జావా 42 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.73 లక్షలుగా ఉంచారు. ఇది మునుపటి మోడల్ కంటే దాదాపు రూ. 16,000 తక్కువ.
- By Gopichand Published Date - 09:15 PM, Wed - 14 August 24

Jawa 42: బైక్ ప్రియులకు శుభవార్త! జావా మోటార్‌సైకిల్ తన కొత్త బైక్ జావా 42ని భారతదేశంలో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోల్చితే జావా 42 Jawa 42) బైక్‌లో సాంకేతిక మార్పులు చేశారు. ఇది కాకుండా కొన్ని కొత్త ఫీచర్లతో పాటు కొత్త రంగులు కూడా చేర్చారు. అయితే బైక్ డిజైన్, ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త జావా ధర, దాని ఫీచర్లు, ఇంజన్ గురించి తెలుసుకుందాం.
ధర ఎంత?
2024 జావా 42 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.73 లక్షలుగా ఉంచారు. ఇది మునుపటి మోడల్ కంటే దాదాపు రూ. 16,000 తక్కువ. మునుపటి మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.89 లక్షలు. బైక్‌లో స్పోక్ వీల్ ఆప్షన్ ఉంది. ఈ బైక్ ఇంజన్ చాలా శక్తివంతమైనది. దీని విశేషాల గురించి తెలుసుకుందాం.
Also Read: Skin Tags Vs Cancer : పులిపిర్లు క్యాన్సర్ కణుతులుగా మారుతాయా ? వైద్యులేం చెబుతున్నారు ?
ఇంజిన్- పవర్
పనితీరు పరంగా కొత్త జావా 42 250cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 27.32 PS పవర్, 26.84 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. బైక్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా అందించారు. కంపెనీ ప్రకారం.. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ట్యూన్ చేయబడింది, ఇది రెండవ, మూడవ, నాల్గవ గేర్‌లో ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఫీచర్లు
2024 జావా 42లో కంపెనీ 17, 18 అంగుళాల అల్లాయ్ స్పోక్ వీల్స్ ఎంపికను ఇచ్చింది. దీనితో పాటు ఇది ఒక రౌండ్ హెడ్‌లైట్‌ని కలిగి ఉంది. ఇది క్లాసిక్ రూపాన్ని ఇస్తుంది. బైక్ రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి. ఈ బైక్ మునుపటి కంటే మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. తద్వారా ఇది అసౌకర్యమైన రోడ్లను సులభంగా దాటగలదు. భద్రత కోసం ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS, అసిస్ట్, స్లిప్ క్లచ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB పోర్ట్ సౌకర్యం ఉంది.