Skin Tags Vs Cancer : పులిపిర్లు క్యాన్సర్ కణుతులుగా మారుతాయా ? వైద్యులేం చెబుతున్నారు ?
చాలామందికి శరీరంపై పులిపిర్లు(Skin Tags) ఉంటాయి. ప్రధానంగా ముఖం, మెడ, చంకలపై ఇవి ఏర్పడుతుంటాయి.
- By Pasha Published Date - 08:43 PM, Wed - 14 August 24

Skin Tags Vs Cancer : చాలామందికి శరీరంపై పులిపిర్లు(Skin Tags) ఉంటాయి. ప్రధానంగా ముఖం, మెడ, చంకలపై ఇవి ఏర్పడుతుంటాయి. వాటిని చూసుకొని చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అవి క్యాన్సర్ కణుతులుగా మారుతాయేమో అని భయపడిపోతుంటారు. ఇంకొందరు పులిపిర్లను(Skin Tags Vs Cancer) పట్టించుకోకుండా వదిలేస్తారు. వీటి గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
వైద్య నిపుణుల కథనం ప్రకారం..కొందరికి వంశపారంపర్యంగా పులిపిర్లు వస్తుంటాయి. ఊబకాయం వల్ల కొందరికి ఇవి వస్తాయి. షుగర్ ఉన్నవారికి సైతం పులిపిర్లు వస్తాయి. పులిపిర్లు శరీరంపై ఏర్పడిన తర్వాత, వాటిలో ఒకటి, రెండు పెద్దసైజులోకి మారే అవకాశం ఉంటుంది. తొడలు, మెడ భాగంలో పులిపిర్లు ఉండడం వల్ల కొందరు అసౌకర్యానికి గురవుతుంటారు. తొడల భాగంలో పులిపిర్లు ఉంటే.. నడిచే టైంలో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. వాటిని చూసి భయపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే పులిపిర్లు క్యాన్సర్ కణుతులుగా మారడం అనేది దాదాపుగా జరగదు.
Also Read :Mineral Rich States : ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
శరీరంపై పులిపిర్లు ఎక్కువ ఉన్నవాళ్లు వైద్యులను సంప్రదించాలి. వైద్యులు అందించే క్రీమ్స్‌ను వాటిపై రాయడం ద్వారా తొలగించుకోవచ్చు. కొంతమంది పులిపిర్లను రేడియో ఫ్రిక్వెన్సీ, లేజర్, ఎలక్ట్రో కార్టియో అనే పద్ధతుల్లో తొలగిస్తుంటారు. ఈ తరహా చికిత్సలు చేయించుకుంటే పులిపిర్లు తొలగించినా.. చర్మంపై మచ్చలు కానీ, రంధ్రాలు కానీ పడవని డాక్టర్లు అంటున్నారు. ఈ చికిత్సను పొందే క్రమంలో పెద్దగా నొప్పి కూడా తెలియదని చెబుతున్నారు.
Also Read :WhatsApp: వాట్సాప్ లో మరోసారి కొత్త ఫీచర్.. గ్రూప్ లో చేరడానికి ముందే సమాచారం!
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.