HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Jawa 42 Fj 350 Launched In India

Jawa 42 FJ 350: ఎన్ఫీల్డ్ బైక్ కి గట్టి పోటీని ఇస్తున్న జావా బైక్.. ధర పూర్తి వివరాలివే!

ఎన్‌ఫీల్డ్ గట్టి పోటీని ఇస్తూ మార్కెట్ లోకి విడుదల అయిన జావా బైక్.

  • Author : Anshu Date : 05-09-2024 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jawa 42 Fj 350
Jawa 42 Fj 350

ప్రస్తుతం భారత మార్కెట్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో ఎన్‌ఫీల్డ్ బైక్స్ కూడా ఒకటి. ఈ బైక్స్ కి మార్కెట్లో ప్రత్యామ్నాయంగా ఏవి రాకపోవడంతో సక్సెస్ఫుల్గా ఎన్ఫీల్డ్ తిరుగులేని ఆదిపత్యాన్ని చెలాయిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ బైక్ కీ పోటీగా జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ రంగంలోకి దిగింది. తన కొత్త ఉత్పత్తి జావా 42ఎఫ్‌జే మోటార్ సైకిల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలుగా ఉంది. ఇది సరికొత్త స్టైలింగ్ తో పాటు, పెద్ద ఇంజిన్ వస్తుంది.

అయితే ఎన్‌ఫీల్డ్ బైక్ తో పోల్చుకుంటే ఈ బైక్ ధర తక్కువే అని చెప్పాలి. కాగా ఈ జావా బైక్స్ కీ సంబంధించిన బుకింగ్స్ ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. డెలివరీలు కూడా అక్టోబర్ రెండో తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఇప్పటికే ఉన్న జావా 42కి అప్ డేటెడ్ వెర్షన్ గా ఇది వస్తోంది. భారత మార్కెట్లో ఇది నేరుగా రాయల్ ఎన్‌ఫిల్డ్ హంట్ 350, హోండా సీబీ 350 వంటి మోడళ్లతో పోటీపడనుంది. సరికొత్త జావా 42ఎఫ్‌జే లుక్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఈ మోటార్ సైకిల్ ఆధునిక రెట్రో థీమ్‌ ను పొందుతుంది. దీనికి టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, పక్కన అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. బండి ట్యాంక్ పై పెద్ద అక్షరాలలో జావా అని ఉంటుంది.

సైడ్ ప్యానల్స్ పాత స్టాండర్డ్ వెర్షన్ లాగానే ఉంటాయి. అయితే సీటు డిజైన్ కొత్తగా ఉంది. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా విభిన్నంగా ఇచ్చారు. దీని ద్వారా రైడర్ కు అదనపు సౌలభ్యం కూడా కలుగుతుంది. అలాగే అల్లాయ్ వీల్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయట. ఇకపోతే ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ముందు వైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్, అసిస్ట్, స్లిప్పర్ క్లట్చ్ వంటివి ఉంటాయి. ఈ సరికొత్త బైక్లో 334సీసీ సింగిల్ సిలెండర్, లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఈ కొత్త ఇంజిన్ అధిక ఎన్వీహెచ్ లెవెల్స్, పనితీరును కలిగి ఉంటుంది. పాత మోడల్ తో పోల్చితే మరింత సమర్థనీయమైన థర్మల్ మేనేజ్మెంట్ యూనిట్ ఉంటుంది. ఇది 22బీహెచ్పీ, 28ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఇతర మెకానిక్ భాగాల గురించి చెప్పాలంటే ముందు వైపు టెలీస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జర్బర్లు ఉంటాయి. డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. డ్యూయల్ చానల్ ఏబీఎస్ తో వస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Jawa 42 FJ 350
  • Jawa 42 FJ 350 bike
  • Jawa 42 FJ 350 bike launch

Related News

    Latest News

    • Limca : అనన్య పాండే చేతికి లిమ్కా బ్రాండ్

    • Harishrao : పొంగులేటి మంత్రి కాదు బిజినెస్‌మెన్ అంటూ హరీష్ రావు ఘాటు తీవ్ర విమర్శలు

    • Paragon : మహిళల కోసం పారాగాన్ ప్రత్యేక ఆఫర్స్

    • Summer Fitness : వేసవిలో నీరసం రాకూడదంటే.. ఈ డైట్ ప్లాన్ మీకోసమే!

    • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd