Maruti Swift: రూ. 30,000 జీతం ఉన్న వ్యక్తి మారుతి స్విఫ్ట్ కారు కొనగలరా? ఒక్కసారి ఈ వార్త చదవండి!
ఢిల్లీలో మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 7,31,000. ఈ ధర ఇతర నగరాల్లో స్వల్పంగా మారవచ్చు. మీరు ఈ కారును రుణంపై కొనుగోలు చేయాలనుకుంటే సుమారు లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
- Author : Gopichand
Date : 02-08-2025 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
Maruti Swift: మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లలో ఒకటైన కొత్త స్విఫ్ట్ (Maruti Swift). ఇటీవల మార్కెట్‌లో విడుదలైన తర్వాత మంచి స్పందన పొందుతోంది. ఈ కొత్త తరం మోడల్ ప్రారంభ ధర రూ. 6.49 లక్షల నుంచి మొదలై, టాప్ మోడల్ ధర రూ. 9.59 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారును ఒకేసారి నగదు చెల్లించకుండా EMI ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.
EMIతో మారుతి స్విఫ్ట్ కొనుగోలు ఎలా?
ఢిల్లీలో మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 7,31,000. ఈ ధర ఇతర నగరాల్లో స్వల్పంగా మారవచ్చు. మీరు ఈ కారును రుణంపై కొనుగోలు చేయాలనుకుంటే సుమారు లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా దీనికి గాను రూ. 6.58 లక్షల వరకు రుణం అందిస్తాయి. అయితే, రుణం పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం చాలా ముఖ్యం.
Also Read: Gold Prices: చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?
మీ నెలవారీ EMI ఎంత?
ఒకవేళ బ్యాంక్ ఈ కారు రుణానికి 9 శాతం వడ్డీ వసూలు చేస్తే మీరు ఎంచుకునే కాలవ్యవధిని బట్టి EMI మొత్తం ఈ విధంగా ఉంటుంది.
- నాలుగు సంవత్సరాల రుణం: నెలకు సుమారు రూ. 16,380 EMI చెల్లించాల్సి ఉంటుంది.
- ఐదు సంవత్సరాల రుణం: నెలకు సుమారు రూ. 13,700 EMI చెల్లించాల్సి ఉంటుంది.
- ఆరు సంవత్సరాల రుణం: నెలకు సుమారు రూ. 11,900 EMI చెల్లించాల్సి ఉంటుంది.
- ఏడు సంవత్సరాల రుణం: నెలకు సుమారు రూ. 10,600 EMI చెల్లించాల్సి ఉంటుంది.
మీ నెలవారీ జీతం రూ. 30,000 ఉంటే ఏడు సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకోవడం ద్వారా మీరు ఈ కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రుణ మొత్తాలు, EMIలు బ్యాంక్ పాలసీలు, వడ్డీ రేట్లు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మారవచ్చు. కారు కొనుగోలు చేయడానికి ముందు బ్యాంకుతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.