Honda Cars India: హోండా కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.73 వేలు తగ్గింపుతో?
మాములుగా వాహన వినియోగదారులు తక్కువ బడ్జెట్ లో మంచి మంచి కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆఫర్ల సమయంలో కారుని
- Author : Anshu
Date : 09-08-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
మాములుగా వాహన వినియోగదారులు తక్కువ బడ్జెట్ లో మంచి మంచి కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆఫర్ల సమయంలో కారుని కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తిని కనబడుతూ ఉంటారు. అయితే ఒకవేళ మీరు కారు కొనుగోలు చేయాలి అనుకుంటే చక్కటి శుభవార్త. ఎందుకంటే ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఆగస్టు నెలలో తన కార్లపై భారీగా తగ్గింపును ప్రకటిస్తోంది. మీరు కారు కొనాలనుకుంటే ఆగస్టులో రూ.73,000 ఆదా చేసుకోవచ్చు.దేశంలోని కొన్ని హోండా డీలర్‌షిప్‌లు ఆగస్టు 2023లో తమ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి.
క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం హోండా భారతదేశంలో రెండు మోడళ్లను అమ్ముతోంది. సిటీ, అమేజ్ సెడాన్. ఈ రెండు కార్ లపై కంపెనీ భారీ డిస్కౌంట్ లను ఇస్తోంది. మీరు హోండా అమేజ్ గురించి మాట్లాడినట్లయితే, ఈ నెలలో మీకు ఈ కారుపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.6,000 కార్పొరేట్ తగ్గింపు, రూ.5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. మొత్తంమీద మీరు రూ.21,000 ఆదా చేసుకోవచ్చు. సిటీ పెట్రోల్ వేరియంట్ లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.28,000 కార్పొరేట్ తగ్గింపు, రూ.5,000 లాయల్టీ బోనస్‌ను అందజేస్తున్నారు.
కేవలం ఇదే కాకుండా, కస్టమర్లు రూ. 20,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌కు కూడా అర్హులు. హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌లపై మొత్తం రూ.73,000 ఆదా చేసుకోవచ్చు. కాగా కంపెనీ సిటీ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా విక్రయిస్తోంది. దీని కొనుగోలుపై, వినియోగదారులు రూ.40,000 నగదు తగ్గింపును పొందేందుకు అర్హులు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం హోండా భారత మార్కెట్ కోసం తన తదుపరి ఉత్పత్తిపై పనిచేస్తోంది. కంపెనీ త్వరలో కాంపాక్ట్ ఎస్ యూవీ
ఎలివేట్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ SUV కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉంటుంది. రాబోయే మోడల్ వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ కానుంది..