BMW Models: సెప్టెంబర్ 1 నుండి బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు!
భారతదేశంలో BMW అత్యంత చవకైన కారు 2 సిరీస్ గ్రాన్ కూపే. దీని ధర రూ. 46.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ XM ధర రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
- By Gopichand Published Date - 09:24 PM, Mon - 18 August 25

BMW Models: బీఎండబ్ల్యూ ఇండియా (BMW Models) తమ కార్ల ధరలను సెప్టెంబర్ 1, 2025 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని మోడళ్ల ధరలు 3% వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో ఇది మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. గతంలో జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా ధరలు పెరిగాయి. ఈ మూడు పెంపుల తర్వాత BMW కార్ల ధరలు ఇప్పటివరకు దాదాపు 10% పెరిగాయి.
ధరల పెంపునకు కారణాలు
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలు.
- డాలర్-రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు.
- వాహనాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు, రవాణా ఖర్చుల పెరుగుదల.
- సప్లై చైన్ సమస్యలు.
- ఈ కారణాలన్నీ ఉత్పత్తి ఖర్చును గణనీయంగా పెంచాయి. ఆ భారం ఇప్పుడు కస్టమర్లపై పడుతోంది.
Also Read: Coolie Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న కూలీ.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
ప్రస్తుత BMW కార్ల ధరలు
భారతదేశంలో BMW అత్యంత చవకైన కారు 2 సిరీస్ గ్రాన్ కూపే. దీని ధర రూ. 46.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ XM ధర రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
భారతదేశంలో అమ్ముడవుతున్న BMW మోడళ్లు
BMW భారతదేశంలో అనేక మోడళ్లను విక్రయిస్తోంది. కంపెనీ తన తమిళనాడు ప్లాంట్‌లో 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్, X1, X3, X5, X7, M340i, iX1 లాంగ్ వీల్‌బేస్ వంటి మోడళ్లను లోకల్‌గా అసెంబుల్ చేస్తుంది. అలాగే i4, i5, i7, i7 M70, iX, Z4 M40i, M2 కూపే, M4 కాంపిటీషన్, M4 CS, M5, M8 కాంపిటీషన్ కూపే, XM వంటి కొన్ని మోడళ్లను పూర్తిగా దిగుమతి చేసుకుని (CBU రూపంలో) విక్రయిస్తోంది.
ధరలు పెరిగినా అమ్మకాలు బలంగానే
ఆసక్తికరంగా ధరలు పెరిగినప్పటికీ BMW ఇండియా అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. 2025 మొదటి అర్ధభాగంలో కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. రెండో అర్ధభాగంలో కూడా మంచి ఫలితాలను ఆశిస్తోంది. ఇది BMW ప్రీమియం కస్టమర్ బేస్, బలమైన బ్రాండ్ విలువను సూచిస్తుంది.
పండుగ సీజన్‌లో కొత్త మోడళ్లు, ఆఫర్లు
ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ పండుగ సీజన్‌ను ప్రత్యేకంగా మార్చడానికి BMW సిద్ధమవుతోంది. కంపెనీ పలు కొత్త, శక్తివంతమైన మోడళ్లను విడుదల చేయనుంది. అంతేకాకుండా కస్టమర్ల కోసం సులభమైన EMI పథకాలు, లీజింగ్ ఆప్షన్లు, బై-బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తామని తెలిపింది. అంటే ధరలు తప్పకుండా పెరుగుతాయి. కానీ కస్టమర్లకు కొనుగోలు చేయడం సులభతరం చేయబడుతుంది.