Coolie Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న కూలీ.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం.. 'కూలీ' భారత్‌లో నాలుగు రోజుల్లో మొత్తం రూ. 194 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 08:47 PM, Mon - 18 August 25

Coolie Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 404 కోట్ల గ్రాస్ కలెక్షన్లు (Coolie Collection) సాధించి అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టింది.
భారతదేశంలో ‘కూలీ’ వసూళ్లు
ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం.. ‘కూలీ’ భారత్‌లో నాలుగు రోజుల్లో మొత్తం రూ. 194 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆయా రోజువారీ వసూళ్ల వివరాలు.
- మొదటి రోజు (గురువారం): రూ. 65 కోట్లు
- రెండో రోజు (శుక్రవారం): రూ. 54.75 కోట్లు
- మూడో రోజు (శనివారం): రూ. 39.5 కోట్లు
- నాలుగో రోజు (ఆదివారం): రూ. 34 కోట్లు
ఈ చిత్రానికి భారతదేశంలో తమిళ వెర్షనే అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. తమిళం తర్వాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈ చిత్రం నాలుగు రోజుల్లో దాదాపు రూ. 15.5 కోట్లు వసూలు చేసింది.
Also Read: Mumbai Rains : వర్షాలు ముంచెత్తిన ముంబై.. స్కూళ్లకు సెలవు, రైళ్లకు అంతరాయం!
ప్రపంచవ్యాప్తంగా రికార్డుల పరంపర
‘కూలీ’ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. తొలి వీకెండ్‌లో విదేశాలలో $45.34 మిలియన్లు (రూ. 397 కోట్లు) వసూలు చేసింది. ఈ భారీ వసూళ్లతో ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.
కూలీ, వార్ 2 సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ‘వార్ 2’ సినిమా కూడా నాలుగు రోజుల్లో రూ. 173.60 కోట్లు వసూలు చేసి మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ ‘కూలీ’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచి రజనీకాంత్ స్టామినాను మరోసారి నిరూపించింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా, ప్రేక్షకులు మాత్రం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆదరించారు.