BHARAT NCAP : కార్ల సేఫ్టీ కోసం “భారత్ ఎన్ క్యాప్”కు శ్రీకారం .. ఏమిటిది ?
BHARAT NCAP : కార్ల భద్రతను పెంచే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. "భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్" (BHARAT NCAP) పేరుతో కారు క్రాష్ టెస్ట్ అండ్ సేఫ్టీ రేటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
- By Pasha Published Date - 03:28 PM, Tue - 22 August 23

BHARAT NCAP : కార్ల భద్రతను పెంచే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. “భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్” (BHARAT NCAP) పేరుతో కారు క్రాష్ టెస్ట్ అండ్ సేఫ్టీ రేటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో BHARAT NCAPను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈసందర్భంగా భారత్ NCAP కొత్త లోగో, స్టిక్కర్‌ను ఆయన ఆవిష్కరించారు. BHARAT NCAP ఇప్పటికే 30 మోడళ్ల క్రాష్ టెస్ట్‌ల కోసం అభ్యర్థనలను స్వీకరించిందని ఆయన ప్రకటించారు. దీంతో కార్ల తయారీలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఇలాంటి స్వదేశీ రేటింగ్ వ్యవస్థను అమలు చేస్తున్న 5వ దేశంగా భారత్ అవతరించింది.
Also read : Chandrayaan-3: చంద్రయాన్-3 పోస్టుపై ప్రకాష్ రాజ్ క్లారిటీ
ఇకపై స్వదేశీ రేటింగ్
మనదేశంలో తయారయ్యే కార్లకు ఇకపై “భారత్ NCAP” ద్వారా స్వదేశీ స్టార్ రేటింగ్ ఇవ్వబడుతుంది. ఇప్పటివరకు మన దేశంలో తయారైన , విక్రయిస్తున్న వాహనాలకు “గ్లోబల్ NCAP” ఏజెన్సీ ద్వారా సేఫ్టీ రేటింగ్ ఇచ్చేవారు. ఫ్యూచర్ లో మనకు ఆ ఏజెన్సీతో అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు BHARAT NCAP అందుబాటులోకి వచ్చేసింది. దీనివల్ల కార్లలో ప్రయాణించే వారి సెక్యూరిటీ మరింత బలోపేతం అవుతుంది. అయితే BHARAT NCAP వ్యవస్థ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.
భారత్ NCAP అంటే ఏమిటి ?
భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP) అనేది క్రాష్ టెస్ట్ మూల్యాంకన కార్యక్రమం. ఇందులో భాగంగానే కారును ఫ్యాక్టరీలో తయారు చేసే క్రమంలోనే క్రాష్ టెస్ట్ చేస్తారు. ఆ క్రాష్ వల్ల ప్రయాణికులపై, కారుపై ఎంతమేర ఎఫెక్ట్ పడుతుందనేది అంచనా వేస్తున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా కారుకు 0 నుంచి 5 వరకు ఏదో ఒక స్టార్ రేటింగ్ ఇస్తారు. దీనివల్ల ఫ్యూచర్ లో కారు కొనే వారు దాని సేఫ్టీ రేటింగ్ ను చూసి, దాని ఆధారంగా కొనుగోలుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారు.