Best Selling Car: భారత మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కారు ఇదే!
గత నెల (సెప్టెంబర్)లో 17,441 యూనిట్ల మారుతి ఎర్టిగా విక్రయించగా.. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ 13,528 యూనిట్ల ఎర్టిగాను విక్రయించింది. ఈసారి మారుతి సుజుకి 3913 యూనిట్లను విక్రయించింది.
- By Gopichand Published Date - 10:36 AM, Wed - 9 October 24

Best Selling Car: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 వాహనాల (Best Selling Car) జాబితా విడుదలైంది. అయితే ఈసారి కస్టమర్లు 5 సీట్లను కాకుండా 7 సీట్ల వాహనాన్ని ఎంచుకున్నారు. మారుతి సుజుకి ఎర్టిగా గురించి మాట్లాడుతున్నాం. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అంటే ఈసారి ఎర్టిగాను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు తహతహలాడుతున్నారు. అమ్మకాల పరంగా ఈ కారు హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియోలను వెనక్కి నెట్టింది.
మారుతి ఎర్టిగా వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది
గత నెల (సెప్టెంబర్)లో 17,441 యూనిట్ల మారుతి ఎర్టిగా విక్రయించగా.. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ 13,528 యూనిట్ల ఎర్టిగాను విక్రయించింది. ఈసారి మారుతి సుజుకి 3913 యూనిట్లను విక్రయించింది. క్రెటా 15,902 యూనిట్లను విక్రయించగా మహీంద్రా స్కార్పియో 14,438 యూనిట్లను విక్రయించింది.
శక్తివంతమైన ఇంజన్, మంచి మైలేజీ
పనితీరు కోసం ఎర్టిగాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 102 bhp శక్తిని, 136.8Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 20.51kmpl మైలేజీని ఇస్తుంది. CNGలో ఇది 26 km/kg మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా మైలేజీ పరంగా డబ్బుకు విలువ.
Also Read: Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..
సేఫ్టీ పరంగా ఎర్టిగా ఫ్లాప్
మారుతి సుజుకి ఎర్టిగాలో EBD, ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ కెమెరా, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన లోడ్ లిమిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ చాలా భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ ఇది మీకు, మీ కుటుంబానికి ఎటువంటి భద్రతను అందించదు. ఎందుకంటే గ్లోబల్ NCAP పరీక్షలో Ertiga కేవలం ఒక స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఎర్టిగా పెద్దల భద్రత కోసం 1 స్టార్, పిల్లల భద్రత కోసం 2 స్టార్ రేటింగ్ పొందింది.
కియా కేరెన్స్‌తో పోటీపడుతుంది
ప్రస్తుతం మారుతి ఎర్టిగా ప్రత్యక్ష పోటీ కియా కేరెన్స్‌తో ఉంది. ఇది 7 సీట్ల మోడల్. కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.51 లక్షల నుండి రూ.19.66 లక్షల వరకు ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో విడుదల కానుంది. ఇది పరీక్ష సమయంలో చాలాసార్లు కనిపించింది.