Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..
Naim Kassem: నస్రల్లా మరణంతో హిజ్బూల్లా నేతృత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, హిజ్బూల్లా తన శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో హిజ్బూల్లా డిప్యూటి చీఫ్ నయూమ్ ఖాసిమ్ తాజాగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. ఓ వీడియో సందేశంలో ఆయన, ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ ప్రజలు నిరాశ్రయులుగా మారడం తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు.
- By Kavya Krishna Published Date - 10:12 AM, Wed - 9 October 24

Naim Kassem: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బూల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. నస్రల్లా మరణంతో హిజ్బూల్లా నేతృత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, హిజ్బూల్లా తన శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో హిజ్బూల్లా డిప్యూటి చీఫ్ నయూమ్ ఖాసిమ్ తాజాగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. ఓ వీడియో సందేశంలో ఆయన, ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ ప్రజలు నిరాశ్రయులుగా మారడం తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు.
నయూమ్ ఖాసిమ్ ఎవరు అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. షియా రాజకీయ పార్టీ అయిన హిజ్బూల్లాలో ఖాసిమ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. హసన్ నస్రల్లా మాదిరిగానే ఖాసిమ్ కూడా హిజ్బూల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భంలో కూడా ఖాసిమ్ పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తెల్ల తలపాగా చుట్టుకొని, వాగ్ధాటిలో సమర్థుడిగా, తన తీక్షణమైన భావజాలంతో ఖాసిమ్ హిజ్బూల్లా రాజకీయ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు.
CM Chandrababu : నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
మహనద్ అలీ, కార్నెగీ మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధి, ఖాసిమ్ గురించి మాట్లాడుతూ, “నస్రల్లా కంటే ఖాసిమ్ చాలా తీవ్ర భావజాలం కల్గిన వ్యక్తి. ఆయన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది,” అని వ్యాఖ్యానించారు. అయితే, నస్రల్లా మృతి తర్వాత, నాయకత్వ బాధ్యతలు ఆయన బంధువు హషేమ్ సఫీద్దీన్‌కు అప్పగించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ, సఫీద్దీన్ ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించకపోవడంతో, ఖాసిమ్ ఆ స్థానాన్ని అధిరోహించినట్లు తెలుస్తోంది.
ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా, హిజ్బూల్లా డిప్యూటీ చీఫ్ నయూమ్ ఖాసిమ్‌పై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఖాసిమ్‌పై అమెరికా ఉగ్రవాద సంబంధాల నిందలతో ఆంక్షలు విధించింది. హిజ్బూల్లా ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తూ, ఖాసిమ్‌ను కూడా అంతర్జాతీయ విధానాల్లో నిరోధించడం జరిగింది.
నయూమ్ ఖాసిమ్ గురించి మరింత లోతుగా చూస్తే, ఆయన దక్షిణ లెబనాన్ లోని కఫర్ ఫిలాలో జన్మించాడు. తన ప్రాథమిక విద్యను పూర్తిచేసిన తర్వాత, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించాడు. విద్యాభ్యాసం పట్ల ఆసక్తితో మతపరమైన విద్యనూ అభ్యసించాడు. ఆయన విద్యార్ధులకు పాఠాలు బోధించేవాడు, ఈ క్రమంలో ఒక ప్రత్యేక విద్యా సంస్థను కూడా స్థాపించాడు. 1970లలో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో మిలిటెంట్ కార్యకలాపాల్లో చేరాడు.
1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ సమయంలో ఏర్పడిన హిజ్బూల్లాలో కీలక పాత్ర పోషించాడు. 1991 నుండి హిజ్బూల్లాలో డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఖాసిమ్, ఆ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకుడిగా ఎదిగాడు. ఆయన తీక్షణమైన వాగ్ధాటి, తీవ్ర భావజాలం, రాజకీయ సమర్థతతో హిజ్బూల్లాలో కీలక నాయకత్వం సాధించాడని చెబుతున్నారు.
Saddula Bathukamma : కన్నుల పండుగగా వేములవాడలో ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు..