Best Mileage Cars: రూ. 10 లక్షల్లోపు మంచి మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ SUV నుండి పూర్తి-పరిమాణ SUV వరకు అనేక వాహనాలు (Best Mileage Cars) అందుబాటులో ఉన్నాయి.
- Author : Gopichand
Date : 09-03-2024 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
Best Mileage Cars: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ SUV నుండి పూర్తి-పరిమాణ SUV వరకు అనేక వాహనాలు (Best Mileage Cars) అందుబాటులో ఉన్నాయి. అయితే మనలో చాలా మంది ఎప్పుడూ తక్కువ ధరలో మంచి మైలేజీనిచ్చే కారు కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. మీరు కూడా మంచి మైలేజ్, రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ రోజు మేము మీ కోసం అలాంటి కొన్ని వాహనాలను తీసుకువచ్చాము.
హ్యుందాయ్ ఐ20
జాబితాలో మొదటి కారు గురించి మాట్లాడుకుంటే.. ఇందులో హ్యుందాయ్ ఐ20ని చేర్చాము. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఈ కారు ధర రూ. 7.04 లక్షల నుండి రూ. 11.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. హ్యుందాయ్ i20 రెండు పవర్‌ట్రైన్ కాన్ఫిగరేషన్స్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ 20 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది. డీజిల్ ఇంజన్ 21 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్
జాబితాలో రెండవ కారు గురించి మాట్లాడుకుంటే.. టాటా ఆల్ట్రోజ్‌ను చేర్చాము. ఇది భారతీయ కార్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరొక హ్యాచ్‌బ్యాక్ కారు. టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 6.65 లక్షల నుండి రూ. 10.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్‌లో మీరు లీటరుకు 18.05 కిమీ మైలేజీని పొందబోతున్నారు. అయితే డీజిల్ ఇంజన్ 23.64 కిమీ/లీటర్ మైలేజీని అందిస్తుంది.
Also Read: YCP Leaders Distributing Gifts : ఏపీలో అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అధికార నేతలు..
మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఇండియాలో ఈ కారుకు ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ధర రూ. 5.52 లక్షల నుండి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 25.19 కిమీ/లీ మైలేజీని అందిస్తోంది., ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న పెట్రోల్ ఇంజన్ 24.43 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది.
మారుతీ సుజుకి డిజైర్
మారుతి సుజుకి డిజైర్ భారతదేశంలో అందుబాటులో ఉన్న కాంపాక్ట్ సెడాన్ మోడల్. దీని ధర రూ. 6.57 లక్షల నుండి రూ. 9.39 లక్షల (ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ ఇంజన్‌తో లీటరుకు 26 కిమీ మైలేజీని పొందుతుంది.
We’re now on WhatsApp : Click to Join
మారుతీ సుజుకి బాలెనో
జాబితాలోని చివరి మోడల్ గురించి మాట్లాడుకుంటే.. మారుతి సుజుకి బాలెనోను చేర్చాము. భారతదేశంలో ఈ మారుతి కారు ధర రూ. 6.66 లక్షల నుండి మొదలై రూ. 9.88 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది లీటరుకు 22.9 కిమీ మైలేజీని అందిస్తుంది.