HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leaders Distributing Gifts To Voters

YCP Leaders Distributing Gifts : ఏపీలో అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అధికార నేతలు..

  • Author : Sudheer Date : 09-03-2024 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp Leaders Distributing
Ysrcp Leaders Distributing

ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడు అధికార పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్యాంట్లు, షర్టులు, చీరలు, కుక్కర్లు, సెల్‌ఫోన్లు, టీకప్పులు ఇలా అన్ని పట్టుకొని విధుల్లో తిరుగుతూ ఓటు జగన్ కే వేయాలంటూ పంపకాలు మొదలుపెట్టారు. ఇలాంటివి చేయకూడదని..చేస్తే కఠిన శిక్ష తప్పదని ఎన్నికల సంఘం చెపుతున్నప్పటికీ.. వైసీపీ (YCP) నాయకులు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా పంపిణి చేస్తున్నారు.

హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జగన్ మళ్లీ సీఎం కావాలంటూ క్రైస్తవ పాస్టర్లతో ప్రార్థనలు చేయించారు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ కొత్త వస్త్రాలు పంపిణీ చేశారు. సీఎం జగన్‌ మేనత్త వై.ఎస్‌.విమలారెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రైస్తవ పాస్టర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ జగన్‌ను ఆశీర్వదించాలని పిలుపునిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మంత్రి జోగి రమేశ్ అయితే క్రైస్తవులమైన మనమంతా ఏసు బిడ్డ జగన్‌ను (CM Jagan) మరొకసారి సీఎం గా, తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ పాస్టర్లను, దైవ సహాయకులను కోరారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిల ఫొటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లకు రూ.7000ల చొప్పున నగదు పంపిణీ చేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లకు కుక్కర్లు, రిసోర్స్‌పర్సన్లకు చీరలు పంపిణీ చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా అయితే వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చారు. నగరి నియోజకవర్గంలోని మహిళలకు మహిళా దినోత్సవ గిఫ్ట్​ల పేరిట చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు మంత్రి రోజా. ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు పంపకాలు మొదలుపెట్టడం తో ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేస్తున్నారు.

Read Also : Strange Weather : ఏపీలో వెరైటీ వాతావరణం.. కొన్ని జిల్లాల్లో ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Distributing Gifts to Voters
  • ycp

Related News

gas cylinder

Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ పెద్దపీట వేసింది. సీబీఎస్‌ఈ (CBSE) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించడంతో పాటు, ఏపీ సచివాలయం మరియు హెచ్‌ఓడీ (HOD) టవర్లలో మెకానికల్

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd