Best Mileage Cars: మంచి మైలేజీతో కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ కార్లను కొనుగోలు చేయండి..!
మార్కెట్లో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని కార్ల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. అలాగే మీరు విపరీతమైన మైలేజీ (Best Mileage Cars)ని పొందుతారు. ఈ కార్ల జాబితాను ఓ సారి చూద్దాం.
- By Gopichand Published Date - 09:28 AM, Sun - 23 July 23
Best Mileage Cars: ప్రతి వ్యక్తి తనకంటూ ఒక కారును కలిగి ఉండాలని కోరుకుంటాడు. కానీ చాలా మందికి కారు కొనడానికి తగిన బడ్జెట్ ఉండదు. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది ఈఎంఐతో పాటు బ్యాంక్ నుండి ఫైనాన్స్ పొందుతారు. మీరు కూడా కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నట్లయితే బడ్జెట్ పెద్దగా లేకుంటే, మార్కెట్లో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని కార్ల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. అలాగే మీరు విపరీతమైన మైలేజీ (Best Mileage Cars)ని పొందుతారు. ఈ కార్ల జాబితాను ఓ సారి చూద్దాం.
మారుతి సుజుకి ఆల్టో K10
ఈ జాబితాలో మొదటి కారు మారుతీ సుజుకికి చెందిన ఆల్టో కె10. కంపెనీ దీన్ని గతేడాది లాంచ్ చేసింది. ఈ కొత్త తరం ఆల్టో ధర రూ. 3.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో దాని విభాగంలో శక్తివంతమైన ఇంజన్ కనిపిస్తుంది. దీని మైలేజీ గురించి చెప్పాలంటే పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు లీటరుకు 24.9 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. మీరు దాని CNG వేరియంట్లో ఎక్కువ మైలేజీని పొందినప్పటికీ, పెట్రోల్ వేరియంట్‌తో పోల్చితే CNG వెర్షన్ కొంచెం ఖరీదైనది.
Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..!
మారుతీ సుజుకి S-ప్రెస్సో
జాబితాలో రెండవ కారు మారుతీ సుజుకి S-ప్రెస్సో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు. కంపెనీ గత ఏడాది మాత్రమే దీన్ని అప్డేట్ చేసింది. S-ప్రెస్సో 5 సీట్ల లేఅవుట్లో వస్తుంది. మీరు ఈ కారులో చాలా ఫీచర్లను కూడా పొందుతారు. మరోవైపు, మైలేజీ గురించి చెప్పాలంటే, మీరు పెట్రోల్‌పై లీటర్‌కు 25.3 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందారు. అయితే దీని CNG వేరియంట్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
రెనాల్ట్ క్విడ్
జాబితాలో మూడవ, చివరి కారు రెనాల్ట్ క్విడ్. తక్కువ బడ్జెట్ కార్లలో ఈ కారు కూడా బెటర్ ఆప్షన్. క్విడ్ ధర గురించి చెప్పాలంటే ఎక్స్-షోరూమ్ ధర రూ. 4 లక్షల 70 వేలు. ఈ కారులో మీరు అనేక ఫీచర్లతో మంచి మైలేజీని పొందుతారు. క్విడ్ మైలేజీ లీటరుకు 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
Related News
Upcoming Hero Bikes: హీరో నుంచి రెండు కొత్త బైక్‌లు.. ఎప్పుడు లాంచ్ అవుతాయంటే..?
యువతకు హై స్పీడ్ బైక్‌లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.