Hyundai Grand i10 Nios: కేవలం రూ.80 వేలకే హ్యుందాయ్ కొత్త కారు.. ధర, ఫీచర్స్ ఇవే?
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లు మార్కెట్ లో ఎక్కువగా సేల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరతోనూ, మైలేజ్ ఇవ్వడంతో
- Author : Anshu
Date : 15-05-2023 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లు మార్కెట్ లో ఎక్కువగా సేల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరతోనూ, మైలేజ్ ఇవ్వడంతో పాటుగా, ప్రీమియం డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్ల విభాగంలో ఉన్న కార్లలో Hyundai Grand i10 Nios ఒకటి, కంపెనీ ఇటీవల చాలా అప్‌డేట్‌లను విడుదల చేయడంతో పాటు కొత్త డిజైన్ మోడల్ కూడా విడుదల చేసింది. అయితే మీరు కూడా ఒకవేళ Hyundai Grand i10 Niosను కొనేందుకు ఇష్టపడితే, ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈజీ ఫైనాన్స్ ప్లాన్, అలాగే డౌన్ పేమెంట్, EMI గురించి ఇపుడు మనం తెలుసుకుందాం..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎరా గురించి చూద్దాం. ఇది బేస్ కారు మోడల్. కాగా దీని ప్రారంభ ధర రూ. 5,73,400 ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ఈ ధర రూ. 6,98,048 ఆన్ రోడ్ వరకు ఉంది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, దాని కోసం అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేకపోతే, మీరు ఇక్కడ పేర్కొన్న ఫైనాన్స్ ప్లాన్ ద్వారా 80 వేలు ఇచ్చి ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆన్‌లైన్ ఫైనాన్స్ ప్లాన్‌ను వివరించే డౌన్ పేమెంట్, EMI కాలిక్యులేటర్ ప్రకారం, మీకు రూ. 80,000 బడ్జెట్ ఉంటే, బ్యాంక్ దీని ఆధారంగా సంవత్సరానికి 9.8 శాతం వడ్డీ రేటుతో రూ. 6,18,048 రుణాన్ని జారీ చేయవచ్చు.
లోన్ మొత్తం ఆమోదించబడిన తర్వాత, మీరు రూ. 80,000 డౌన్ పేమెంట్ చెల్లించి, ఆ తర్వాత మీరు ప్రతి నెలా రూ. 13,071 నెలవారీ EMIని తదుపరి 5 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ కారు మైలేజ్, ఫీచర్ ల విషయానికి వస్తే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎరా ఈ ఫైనాన్స్ ప్లాన్ చదివిన తర్వాత, మీరు ఇంజన్ నుండి ఫీచర్లు ,మైలేజీ వరకు ప్రతి చిన్న, పెద్ద పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. హ్యుందాయ్ i10 Grand Nios Aira 1197cc 1.2L పెట్రోల్ ఇంజన్‌తో 81.80bhp శక్తిని, 113.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఈ కారు మైలేజ్ ఎంత అన్న విషయానికి వస్తే.. మైలేజీ కి సంబంధించి, ఈ హ్యాచ్‌బ్యాక్ లీటర్ పెట్రోలుకు 20.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజీని ARAI ధృవీకరించింది. మీరు పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతుంటే ఈ కారులోనే సీఎన్జీ మోడల్ అందుబాటులో ఉంది. ఇది 1 కిలోల CNG పై 35 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. కాగా ఈ కారు ఫీచర్ ల విషయానికి వస్తే.. దీనికి మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, 3 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి.