YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్‌ఆర్‌సీపీ
YS Sharmila: అటాచ్‌మెంట్‌లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
- By Latha Suma Published Date - 05:39 PM, Fri - 25 October 24

YSRCP : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్ తమకు ఆస్తులు ఇవ్వకుండా ఎలా మోసం చేస్తున్నారో, ఎలా కోర్టుకు లాగారన్న అంశాల్ని ప్రస్తావించారు. దీనిపై వైస్‌ఆర్‌సీపీ ఘాటుగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వైయస్ షర్మిల రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ లాజిక్ లేదని వైస్‌ఆర్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వరప్రసాద్ రెడ్డి తెలిపారు. అటాచ్‌మెంట్‌లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ షర్మిల కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారని ఆరోపించారు. షేర్ బదిలీ ఫారమ్‌లలో బదిలీదారుల సంతకాలు లేవన్నారు. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. బదిలీదారుల సమ్మతి కూడా పొందలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించిన వారి చేతిలో వైఎస్ షర్మిలారెడ్డి కీలుబొమ్మగా మారారని ఆయన ఆరోపించారు. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణాన్ని సంబరంగా చేసుకున్న వాళ్లు వారన్నారు.
వైఎస్ షర్మిలకు ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రేమ, ఆప్యాయతతో ఇవ్వాలనుకున్న ఆస్తులు దక్కకపోవచ్చని, కానీ ఖచ్చితంగా, డాక్టర్ వైఎస్ఆర్ వ్యతిరేకులు తమ ఉద్దేశ్యానికి తగినట్లుగా జరుగుతున్న పరిణామాల పట్ల చాలా సంతోషిస్తున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న అదే శక్తుల చేతుల్లో వైయస్ఆర్ అభిమాన పుత్రిక వైయస్ షర్మిల రెడ్డి ఓ పావుగా మారారన్నారు. ఈ దుష్టశక్తుల చర్చిల నుండి బయటపడాలని వైఎస్ షర్మిలారెడ్డిని ఆయన కోరారు.
Read Also: