YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
- By Prasad Published Date - 06:20 PM, Sat - 17 September 22

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది. లిక్కర్ స్కాంలో ఏపీలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీల్లో ఈ సోదాలు జరిగాయి.ఈ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంటకు చిక్కులు తప్పేలా కనపడటం లేదనే చర్చ జోరుగా సాగుతుంది. కేజ్రీవాల్ సర్కార్ ను బోనులో నిలబెట్టాలని మోదీ ప్రభుత్వం ఈ లిక్కర్ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పక్షాన సొంత పార్టీ నేతలు ఒక్కరు కూడా నోరు మెదపడంలేదు. అయితే ఆయన గత కొంతకాలంగా వైసీపీ అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీ అధిష్టానం మాగుంటకు ప్రాధాన్యత తగ్గించారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అయితే ఇప్పడు లిక్కర్ స్కాంలో ఆయన కార్యాలయం,ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించడంతో బీజేపీ, టీడీపీలోకి వెళ్లేందుకు దారులు ముసుకుపోయాయి. ఇటు సొంత పార్టీ నేతలు సైతం ఆయనకు మద్దతుగా ఎవరు మాట్లాడటం లేదు. అధికార పార్టీ నేతలు ఈ దాడులు గురించి మాట్లాడితే ఎక్కడిదాకా వెళ్తుందోననే భయందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.