HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leader Sajjala Fires On Tdp

YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

  • Author : Prasad Date : 02-06-2026 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sajjala
Sajjala

రెండేళ్ల చంద్రబాబు కూటమి పాల‌న‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని ఆరోపించారు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ద‌గా, మోసం, వెన్నుపోటుకి ప‌రాకాష్ట‌గా ఈ రెండేళ్ల కూట‌మి పాల‌న నిలిచిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు వెన్నుపోటు పాల‌న‌కు రెండేళ్లు పేరుతో తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర స్థాయి స‌మావేశానికి ఆయ‌న ముఖ్య హాజ‌రైయ్యారు. ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశాన‌ని.. 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చీకటి సామ్రాజ్యాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఆయ‌నే అన్నారు. మ‌హిళా విభాగం ద్వారా ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను రాష్ట్ర మ‌హిళ‌ల‌కు గుర్తుచేసి, వాస్తవాలను గణాంకాలతో సహా వివరించడంతోపాటు మేమున్నామనే భరోసా ఇవ్వాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్ కి చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా అని వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి ప్ర‌శ్నించారు. వీరితోపాటు ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయ‌స్సార్సీపీ మ‌హిళా నాయ‌కులు పాల్గొని ప్ర‌సంగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Sajjala Rama Krishna Reddy
  • ycp
  • ysrcp

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • AP CM Chandrababu

    CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • AP TDP

    AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

Latest News

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

  • Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd