AP : ఏపీలో రేపటి నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు అమలు..!!
ఆంధ్రప్రదేశ్ యువతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు...వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమల్లోకి రానున్నాయి.
- By hashtagu Published Date - 07:28 AM, Fri - 30 September 22

ఆంధ్రప్రదేశ్ యువతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు…వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇందుళో భాగంగా…శుక్రవారం సాయంత్రం ఈ పథకం వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సాయంత్రం 3 గంటలకు వెబ్ సైట్ ను ప్రారంభిస్తారు.
ఈ పథకానికి అర్హులు ఎవరంటే అమ్మాయి వయస్సు 18ఏళ్లు…అబ్బాయి వయస్సు 21 ఏళ్లు ఉండాలి. గ్రామాల్లో ఆదాయం నెల పదివేలు…పట్టణాల్లో నెలకు 12వేలకు మించి ఉండరాదు. విద్యుత్ వాడకం 300యూనిట్ల లోపు ఉండాలి. కుటుంబంలో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారు…ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు. ఇక అన్ని సంక్షేమపథకాల మాదిరే ఈ కల్యాణమస్తు, షాదీ తోఫా కూడా ఆరు దశల్లో తనిఖీలు ఉంటాయని సమాచారం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది. మైనార్టీలకు షాదీ తోఫా. ఎస్సీ , ఎస్టీలకు లక్ష రూపాయాలు..కులాంతర వివాహరం చేసుకుంటే 1.20లక్షలు ఇవ్వనున్నారు. బీసీలకు 50వేలు. వీరు కూడా కులాంతర వివాహం చేసుకుంటే 75వేలు ఇవ్వనున్నారు. మైనార్టీలకు లక్ష, దివ్యాంగులకు 1.50 ఇవ్వనున్నారు.